ఆ విషయంలో హీరోలకు మించి టాప్ పొజిషన్ కి చేరుకున్న నయనతార..!

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం తో నటనా ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు హీరోయిన్గా ఏకంగా 74 చిత్రాలకు పైగా నటించి మరో రికార్డును సొంతం చేసుకుంది . అంతేకాదు ఇండస్ట్రీలోకి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె చేతినిండా పెద్ద పెద్ద ఆఫర్లతో దూసుకుపోతూ సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నుంచి కొన్ని పదుల సంఖ్యలో ఆఫర్లు వచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు.Nayanthara-Vignesh Shivan Wedding: Netflix releases unseen photos of  couple; see romantic pics here | Ott News – India TV

కానీ వివాహమనంతరం బాలీవుడ్లోకి ప్రవేశించింది ఈ ముద్దుగుమ్మ. షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జావాన్ చిత్రంలో నయనతార కీలక పాత్ర పోషిస్తూ అక్కడ తెరంగేట్రం చేసింది. హీరోయిన్ గా నయనతార ఎన్నో సినిమాలలో నటిస్తున్నప్పటికీ దక్షిణ సినీ ఇండస్ట్రీలో ఈమెకు మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోతూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో పారితోషకం తీసుకుంటూ ఉందని సమాచారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నయనతార తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తే ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రూపాయల పారితోషం తీసుకుంటుందనే టాక్ బాగా వైరల్ గా మారుతోంది. అంతేకాదు హీరోలకు మించి ఈ రేంజ్ లో పారితోషం తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు దక్షిణ సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ పదికోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది అంటే సౌత్ లో ఇది చాలా రేర్ ఫీట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నయనతారకు మాత్రమే అది సాధ్యమవుతుందని అందరూ చెబుతున్నారు. ఇక ఇంత పారితోషకం తీసుకుంటూ ఏకంగా 75 వ చిత్రానికి కూడా హీరోయిన్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.