గంటా…నీకో దండం స్వామి!

ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారని చెప్పొచ్చు. అసలు రాజకీయం చేసినట్లు ఉండరు గాని…ఆయన చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అర్ధం కాకుండా ఉంటుంది..ఆయన వ్యూహాలు సొంత పార్టీ వాళ్ళకే అర్ధం కావు. 2019 ఎన్నికల ముందు వరకు గంటా రాజకీయం క్లారిటీగానే నడిచింది…కానీ 2019 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది..టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గాని..ఆ పార్టీలో పనిచేయరు..అలాగే గెలిపించిన నియోజకవర్గంలోనూ పనిచేయరు. పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లు ఉంటారు. కానీ ఆయన చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంటుంది.

ఒకసారి ఆయన బీజేపీలోకి వెళ్తారని వార్తలు వస్తాయి..మరొకసారి ఏమో వైసీపీలోకి వెళ్లిపోతున్నారని అనేక సార్లు కథనాలు వచ్చాయి. సరే పార్టీ మారిపోతారనుకునే లోపే…చంద్రబాబుతో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. సరే చంద్రబాబుని కలిశారు కదా…ఈయన టీడీపీలోనే ఉంటారని అంతా అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ నిమిషమే ఆయన రాజకీయం మారుతుంది. అనూహ్యంగా కాపు నేతలతో మీటింగ్ పెడతారు…కాపులకు అధికారం దక్కాలని చెబుతారు.

దీంతో ఈయన…పవన్ కల్యాణ్ కోసం పనిచేస్తున్నారా?అని  డౌట్ వస్తుంది…అలాగే జనసేనలోకి వెళ్లిపోతారులే అనుకుంటారు. కానీ ఇవేమీ జరగవు…ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటారు..టీడీపీలో మాత్రం పనిచేయరు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…కానీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయరు.

అసలు టోటల్ గా గంటా రాజకీయమే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకే టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం గంటాని లైట్ తీసుకున్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళితే తమకెందుకులే అన్నట్లు ఉండిపోయారు. . కార్యకర్తలైతే…గంటాకో దండం…ఆయన పార్టీ మారిపోతేనే బెటర్ అనుకునే పరిస్తితికి వచ్చేశారు. ఇంకా ఆయన్ని పట్టించుకోవడమే మానేశారు. అంటే గంటా రాజకీయం చూసి తమ్ముళ్లకే విసుగు వచ్చేసింది. మరి రాజకీయాల్లో ఇంత విసుగు తెప్పించిన గంటా చివరికి ఏ పార్టీలోకి వెళ్తారో చూడాలి.