విశాఖ రాజకీయాల్లో వారిద్దరిదీ సుదర్ఘీమైన ప్రస్థానం, ఒకేపార్టీ నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారు. కేబినెట్ సహచరులుగాను పనిచేశారు. కానీ ఒకరంటే మరొకరికి గిట్టదు. ఇద్దరి మధ్య పరస్పర విమర్శలు, విసుర్లే ఉంటాయి. పార్టీ అధినేత జోక్యంతో మెత్తబడినట్లు కనిపిస్తారు. బాస్ కోసమే చిరునవ్వులు చిందించి, చేతులు కలుపుతారు. కొన్నాళ్లకే మళ్లీ వైరానికి దిగుతూ పాతపాటే పాడుతారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత […]
Tag: ganta srinivasarao
సీటు కోసం గంటా పాట్లు..బాబు కనికరిస్తారా?
గత కొన్నేళ్లుగా విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు ఊహించని తిప్పలు వచ్చాయి. ఆయనకు సైతం సీటు కోసం కష్టపడే పరిస్తితి వచ్చింది. ఆ పరిస్తితి ఆయన చేతులారా చేసుకున్నారనే చెప్పాలి. రాజకీయాలకు అనుగుణంగా ముందుకెళ్లడంతో గంటాకు ఇపుడు ఇబ్బందులు వచ్చాయి. అనేక మార్లు టిడిపిలో సత్తా చాటిన గంటా..గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచారు. అయితే టిడిపి అధికారంలో లేకపోవడంతో గంటా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో కనిపించలేదు..నియోజకవర్గంలో […]
గంటా సీటుపై కన్ఫ్యూజన్..అక్కడ ఓటమే?
నెక్స్ట్ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పోటీ చేసే సీటు ఏది? ప్రతిసారి నియోజకవర్గం మార్చే ఆయన ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన టిడిపిలోనే కొనసాగే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ పార్టీలోనే ఉంటారు. అయితే ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటివరకు గంటా అనకాపల్లి ఎంపీగా ఒకసారి..చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా […]
గంటా…నీకో దండం స్వామి!
ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారని చెప్పొచ్చు. అసలు రాజకీయం చేసినట్లు ఉండరు గాని…ఆయన చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అర్ధం కాకుండా ఉంటుంది..ఆయన వ్యూహాలు సొంత పార్టీ వాళ్ళకే అర్ధం కావు. 2019 ఎన్నికల ముందు వరకు గంటా రాజకీయం క్లారిటీగానే నడిచింది…కానీ 2019 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది..టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గాని..ఆ పార్టీలో పనిచేయరు..అలాగే గెలిపించిన నియోజకవర్గంలోనూ […]
‘గంటా’ సరికొత్త పొలిటికల్ స్టెప్
గంటా శ్రీనివాసరావు.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కనిపించే నాయకుడు.. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, నిన్న టీడీపీ గవర్నమెంటులో అధికారం చెలాయించిన వ్యక్తి. ఏ పార్టీకి అధికారం వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆ పార్టీ కండువా కప్పుకునే అలవాటున్న వ్యక్తి అని పొలిటికల్ సర్కిళ్లలో పేరున్న మనిషి. అయితే 2019లో ఆయన అంచనాలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోయింది. దీంతో రెండేళ్లుగా ఆయన మౌనం వహించారు. ప్రజల్లో్ల కూడా పెద్దగా లేరు. […]
ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?
వైజాగ్ స్టీల్ ప్లాంట్(వీఎస్పీ) ప్రైవేటీకరణ అవుతుందో, లేదో పక్కన పెడితే ప్రైవేటు విషయం కేంద్రం ప్రకటించినప్పటి నుంచీ ఏపీలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లో సానుభూతిని సంపాదించాలని భావిస్తున్నాయి. అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే అందరికంటే ఓ అడుగు ముందుకేసిన వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీఎస్పీ పరిరక్షణకు మద్దతుగా రాజీనామా చేసినా ఆ తరువాత స్పీకర్ […]
చంద్రబాబు కొత్త బాధ్యతలు ట్రయిలర్… ఉక్కిరిబిక్కిరి లో కొత్త మంత్రులు
అన్న ప్రాసన రోజే ఆవకాయ అనే నానుడి ఎంతో సుపరిచితం!! ఇప్పుడు ఏపీలో కొత్త కేబినెట్లో మంత్రులు కూడా దీనిని గుర్తుచేసుకుని బోరుమంటున్నారు. ఎన్నో రోజులు ఊరించి ఊరించిన సీఎం చంద్రబాబు.. ఆఖరుకి తన క్యాబినెట్‌ను ప్రకటించారు. ఇందులో పాత, కొత్తవారితో కలిపి మొత్తం 25 మంది ఉన్నారు. దీంతో కొత్తగా పదవి పొందిన వారి ఆనందానికి అవధుల్లేవు. అలాగే తమ పదవి పదిలమైనందుకు కొంతమంది సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం, సంబరం కొద్ది గంటల్లోనే ఆవిరి […]
గంటా నక్క తోక తొక్కాడా..!
నక్కతోక తొక్కడమంటే ఇదేనేమో! ఇక మంత్రి వర్గం నుంచి దాదాపు పేరు తొలగించే సమయానికి ఒకే ఒక్క విజయం గంటా శ్రీనివాసరావును కాపాడింది. ఆయనపై అప్పటివరకూ గుర్రుగా ఉన్న చంద్రబాబు.. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంతో.. యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలోనూ ఆయన చాలా సేఫ్‌గా ఉన్నారు! ఆయన్ను టార్గెట్ చేస్తూ.. ఎంతమంది గురిపెట్టినా అవి చివరకు లక్ష్యం తప్పుతున్నా యనడంలో సందేహం లేదు! ఏప్రిల్ 6న మంత్రివర్గ […]
మంత్రి పదవి రేసులో ఆశావహుల లిస్ట్ చూస్తే షాకే..
మంత్రి వర్గ విస్తరణలో ఎవరిని ఉంచుతారో తెలీదు.. ఎవరి బెర్తు కన్ఫార్మ్ అవుతుందో క్లారిటీ లేదు! ఎవరి పోస్టు పీకేస్తారో ఊహలకు అందడం లేదు! పార్టీ అధినేత అనుగ్రహం ఎవరిపై ఉంటుందో ఇప్పటికీ స్పష్టత లేదు! కానీ ఆశావహుల జాబితా మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్నానని, తనకు అవకాశం కల్పించాలని ఒకరు… తనకు చోటు కల్పిస్తే జిల్లాలో సామాజిక అంశాల పరంగా బలం పెరుగుతుందని మరొకరు.. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు […]