నందమూరి కళ్యాణ్ రామ్ చారిత్రక కథాంశంలో నటించిన సినిమా బింబిసార. గత కొంత కాలంగా కళ్యాణ్ రామ్ కు హిట్టు లేదు. 2015లో వచ్చిన పటాస్ సినిమా తర్వాత ఆరేంజు హిట్టు కోసం కళ్యాణ్ రామ్ విశ్వప్రయత్నలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని ఏలిన రాజు చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ దర్శకుడుగా పరియయం అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ ఫాంటసీ డ్రామాను నిర్మించారు. బింబిసార ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల మూందుకు రానుంది. కళ్యాణ్ రామ్ కేరియర్‌లోనే అత్యధికంగా రు. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ సినిమా ఏపి, తెలంగాణ థియేట్రికల్ రైట్సు ను అగ్ర నిర్మాత దిల్ రాజు రు. 18 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 5న రీలిజ్ అవుతున్నా బింబిసారాకు పోటీగా సీతారామం సినిమాతో పాటు పలు సినిమాలు లైనులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కళ్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమా ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా వస్తే సినిమాపై హైప్ ఖచ్చితంగా మరో లెవల్‌కు చేరుతుంది.
ఇప్పటికే జూనీయర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఫ్రివ్యూ చూసి సినిమా అవుట్ పుట్ అదిరిపోయిందని సినిమా యూనిట్ కు కితాబు ఇచ్చిన విషయం తేలిసిందే. ఏ టై ట్రావెల్ ప్రాం ఈవిల్ టు గుడ్ అన్నఉప శీర్షికతో వస్తున్న బింబిపార పై ట్రేడ్ వర్గాల్లో ఇటు సిని అభిమానులో బరి అంచనలు ఉన్నయి.
కళ్యాణ్‌రామ్ ఇ సినిమాలో బింబిసార అనే క్రూర మైన రాజు గా ఇతరం మోడ్రన్ యూవకుడిగ రెండు వేరియేషన్స్ ఉన్నపాత్ర లో కనిపించన్నుడు బింబిసార తెలుగు తో పాటు లన్ని బాషా లో విడుదల అవుతుంది కేథరిన్ తేసరా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.