ప్రస్తుతం బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు. ఇక ఈ క్రమంలోనే పలువురు హౌస్ మేట్స్ ను కూడా ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సీజన్లో సామాన్యులకు కూడా అవకాశం ఉంటుంది అని గతంలో నాగార్జున అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే . మరి సామాన్య ప్రజలను ఎలా ఎంపిక చేసుకుంటారు అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక మరొకవైపు సెలబ్రిటీలను ఇందులో హౌస్ మేట్స్ గా తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు.
ఈ క్రమంలోనే గతంలో సుమా కంటే మంచి పొజిషన్ను సంపాదించుకొని స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభానుతో చర్చలు జరిపించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇక గతంలో కూడా ఉదయభానుకు మంచి పారితోషకంతో బిగ్ బాస్ ఆఫర్ చేసినా..ఆమె మాత్రం వారి ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఇవ్వనంత పారితోషకాన్ని ఉదయభానుకి ఇవ్వడానికి బిగ్బాస్ నిర్వహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయంపై ఆమెతో సిట్టింగ్ ఏర్పాటు చేసి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. అంతేకాదు బిగ్ బాస్ వేదికపై ఉదయభాను హౌస్మేటుగా వ్యవహరిస్తే టిఆర్పి రేటింగ్ బాగా పెరుగుతుందని ఆలోచన కూడా వారిలో ఉన్నట్లు సమాచారం. మరి బిగ్ బాస్ నిర్వహకులు చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లభిస్తుందా లేదా అనే విషయం తెలియాలి అంటే ఉదయభాను ఈ విషయంపై స్పందించక తప్పదు.
ఇకపోతే గతంలో బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా స్టార్ యాంకర్ గా కొనసాగిన ఉదయభాను తెలంగాణ యాస లో మాట్లాడుతూ ఎంతోమంది ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది . అంతే కాదు సినిమాలలో కూడా పలు పాత్రలు చేసిన ఈ ముద్దుగుమ్మ అటు వెండితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయిందని చెప్పవచ్చు. ఇకపోతే వివాహం అనంతరం కుటుంబ బాధ్యతల రీత్యా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.. ఉదయభాను బిగ్ బాస్ నిర్వహకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరొకసారి ఆమెను చూడడానికి ఆమె అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.