మళ్ళీ ఆ మంత్రి హైలైట్ అవుతున్నారుగా!

ఏపీలో చాలామంది మంత్రుల గురించి ప్రజలకు సరిగ్గా అవగాహన లేదనే చెప్పాలి…ఏ శాఖకు ఏ మంత్రి పనిచేస్తున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. అంటే పాత మంత్రులైన, కొత్త మంత్రులైన…టోటల్ గా మంత్రివర్గంలో కొందరు మాత్రమే జనాలకు తెలుస్తున్నారు. మిగిలిన వారు అంతగా హైలైట్ అవ్వడం లేదు. అంటే జనంలో పెద్దగా తిరగకపోవడం గాని, మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గాని వెనుకబడి ఉండటం వల్ల కొందరు మంత్రులు అనే సంగతి జనాలకు తెలియడం లేదు.

పైగా ప్రభుత్వం ఏం చేసిన అది జగన్ చేశారునుకుంటున్నారు తప్ప..మంత్రులని పట్టించుకోవడం లేదు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదనే చెప్పొచ్చు.  అయితే ఇలా తక్కువగా హైలైట్ అయిన మంత్రుల్లో గుమ్మనూరు జయరాం ఒకరని చెప్పొచ్చు. ఆలూరు నుంచి రెండోసారి గెలిచిన జయరాం…మొదట్లోనే జగన్ క్యాబినెట్ లో ఛాన్స్ కొట్టేశారు. కార్మిక శాఖ మంత్రిగా పని మొదలుపెట్టారు. అయితే ఈయన శాఖలో అనేక అక్రమాలు జరిగాయని  టీడీపీ మొదట నుంచి విమర్శిస్తుంది.

అలాగే మంత్రి జయరాం బెంజ్ కారు లంచం తీసుకున్నారని, భూములు కబ్జా చేస్తున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల వల్ల జయరాంకు చాలా నెగిటివ్ పెరిగింది..అలాగే ఆలూరులో మంత్రి బంధువులు, అనుచరులు పేకాట ఆడిస్తున్నాఎరని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇలా అన్నీ రకాలుగా మంత్రిపై ఆరోపణలు వచ్చాయి…దీంతో జయరాం నెక్స్ట్ క్యాబినెట్ లో ఉండరని అంతా అనుకున్నారు..కానీ జగన్…జయరాంని మళ్ళీ క్యాబినెట్ లో కొనసాగించారు. అయితే కొన్ని రోజుల నుంచి జయరాం పెద్దగా కనబడటం లేదు…మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా తక్కువే. అయితే తాజాగా డబ్బులు ఉంటేనే కదా రోడ్లు వేసేది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జయరాం బయటకు రాగానే.. కార్మిక శాఖలో జరిగిన బదిలీల్లో మంత్రి అవినీతిపై విచారణ జరపాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. దీంతో మరోసారి ఏపీ రాజకీయాల్లో మంత్రి గుమ్మనూరు హైలైట్ అయ్యారు. మరి గుమ్మనూరుని టీడీపీ ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నట్లు కనిపిస్తోంది.