చినబాబుని ఆపింది ఎవరు గురు!

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం..అవసరాలని బట్టి, పరిస్తితులని బట్టి రాజకీయాలు మారిపోతాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు సంభవిస్తున్నాయి…ఇప్పటివరకు జగన్ కు తిరుగులేదనే పరిస్తితి..కానీ ఆ పరిస్తితి ఇప్పుడు మారుతూ వెళుతుంది…అలాగే రాజకీయంగా పవన్ కల్యాణ్ కు పెద్ద బలం లేదని ఇప్పటివరకు విశ్లేషణలు వచ్చాయి…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి.

అదే సమయంలో బాబుకు వయసు అయిపోయిందని, ఇక బాబు రాజకీయాలు చేయలేరని, తెలుగుదేశం పార్టీని పైకి లేపలేరని కామెంట్లు వచ్చాయి…కానీ అవన్నీ తప్పు అనే దిశగా బాబు రాజకీయం ఉంది. ఇక గత ఎన్నికల ముందు నారా లోకేష్ పెద్ద పప్పు అని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే లోకేష్ రాజకీయం ఉండేది..రాజకీయంగా తప్పులు, తడబాట్లు చాలానే చేశారు. దీని వల్ల లోకేష్ కు మాత్రమే కాదు..పార్టీకి కూడా డ్యామేజ్ జరిగింది.

అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత లోకేష్ వైఖరిలో మార్పు వచ్చింది..గతనికి భిన్నంగా లోకేష్ రాజకీయం చేస్తూ వస్తున్నారు..నిదానంగా మాస్ లీడర్ గా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు…తప్పులు, తడబాట్లు సరిదిద్దుకుంటూ..వైసీపీకి ధీటుగా రాజకీయం చేస్తున్నారు. ఇలా దూకుడుగా రాజకీయం చేసే చినబాబు ఈ మధ్య కాస్త తగ్గారు..రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండటం లేదు.

ఏదైనా సోషల్ మీడియాలోనే వైసీపీపై విరుచుకుపడుతున్నారు తప్ప..ప్రజా క్షేత్రంలోకి రావడం లేదు. ఏడాది ముందు వరకు చంద్రబాబు ఇంటికి పరిమితమైతే…చినబాబు ప్రజా క్షేత్రంలో యాక్టివ్ గా తిరిగారు. మరి ఏమైందో తెలియదు గాని ఈ మధ్య చంద్రబాబు ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తుంటే..చినబాబు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

మరి చినబాబు ప్రజల్లోకి రాకపోవడానికి ఏమైనా కారణం ఉందా? లేక చినబాబు వల్ల పెద్దగా ఉపయోగం లేదని చంద్రబాబు బ్రేకులు వేశారా? అది కాదంటే చినబాబుని పాదయాత్రకు రెడీ చేస్తున్నారా? అనేది క్లారిటీ రావడం లేదు. మొత్తానికైతే చినబాబు ఎందుకు స్లో అయ్యారనేది టీడీపీ కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది.