విడాకులకు సిద్ధమైన మరో బాలీవుడ్ జంట..!

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో ఎక్కువగా ఎన్నో జంటలు ఆదర్శంగా నిలవాల్సింది పోయి విడాకులు తీసుకుంటూ తమ వైవాహిక జీవితానికి దూరం అవుతున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ నుంచి నాగచైతన్య – సమంత, కోలీవుడ్ నుంచి ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ – కిరణ్ రావు లాంటి స్టార్ సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితంలో ఎక్కువకాలం సంతోషంగా నిలవలేక విడాకులు తీసుకొని దూరం అవుతుంటే.. ఇటీవల మలైకా అరోరా ఖాన్ కూడా అర్బాజ్ నుంచి విడాకులు తీసుకొని.. ఇదే పని చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ క్రమంలోనే ఆమె స్నేహితురాలు గాల్స్ గ్యాంగ్ సభ్యురాలు అయిన షమితాశెట్టి కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.Shamita Shetty and Raqesh Bapat SHOCK fans by announcing breakup | Bollywood Bubble

షమిత శెట్టి ఎవరో కాదు శిల్పా శెట్టి సోదరి అన్న విషయం చాలామందికి తెలిసింది. ఇక ఈమె టాలీవుడ్ కి బాగా సూపరిచితురాలు. కానీ ఎక్కడ స్థిరపడలేకపోయింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు లేకపోవడంతో బిగ్ బాస్ గత సీజన్లో కనిపించి అలరించింది. ఇక అక్కడే రాకేష్ బాపట్ తో పరిచయం ఏర్పడి , ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఇక తాజాగా తన భర్త రాకేష్ బాపట్ నుంచి విడిపోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లను నిజం చేస్తూ షమితా శెట్టి కూడా నిజంగానే విడిపోతున్నామని మంగళవారం సాయంత్రం ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది..shamita shetty, ಶಿಲ್ಪಾ ಶೆಟ್ಟಿ ಸಹೋದರಿ ಶಮಿತಾ ಶೆಟ್ಟಿಗೆ ಲವ್ ಬ್ರೇಕಪ್; ಒಂದು ವರ್ಷದೊಳಗಡೆ ದೂರಾದ ಜೋಡಿಹಕ್ಕಿ - shilpa shetty sister shamita shetty announce breakup with rakesh bapat - Vijaya ...

ఇంస్టాగ్రామ్ ద్వారా షమిత శెట్టి.. దీనిని బ్రేకప్ అని నేను స్పష్టం చేయడం చాలా ముఖ్యం . ముఖ్యంగా రాకేష్ నేనిప్పుడు కలిసి లేము. కొంతకాలంగా దూరంగా ఉంటున్నాము. ఇక ఈ మ్యూజిక్ వీడియో మాకు చాలా మద్దతునిచ్చిన అభిమానులందరికీ కోసం అంటూ షమిత రాసుకొచ్చింది. ఇకపోతే త్వరలోనే షమిత – రాకేష్ ఇద్దరు ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించనున్నారు. ఇక చివరిగా మీ అందరికీ ప్రేమ కృతజ్ఞతలు అంటూ ఆమె తన నోటును ముగించింది.