మహిళా మంత్రులకు కష్టమేనండి..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి…అధికారంలో ఉన్న వైసీపీకి పూర్తి ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తున్నా సరే ఎక్కడో ప్రతిపక్ష టీడీపీ పుంజుకుంటున్నట్లే ఉంది..ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది…కొన్ని స్థానాల్లో జనసేనకు కూడా పట్టు దొరుకుతుంది.

అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి వన్ సైడ్ విజయం దక్కడం మాత్రం చాలా కష్టమని తెలుస్తోంది..ఈ సారి టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది…అదే సమయంలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి కష్టాలు తప్పవనే పరిస్తితి ఉంది. మొత్తానికైతే నిదానంగా వైసీపీకే మైనస్ పెరుగుతున్నట్లు కనిపిస్టోని. ఈ క్రమంలోనే ఏపీలో కొందరు మంత్రులు ఓటమి దిశగా వెళుతున్నట్లు కనిపిస్తోంది…గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఈజీగా వారు గెలవడం కష్టమని అర్ధమవుతుంది.

ముఖ్యంగా మహిళా మంత్రులకు రిస్క్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాబినెట్ లో నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. ఆర్కే రోజా, విడదల రజిని, తానేటి వనిత, ఉషశ్రీ చరణ్..ఈ నలుగురు క్యాబినెట్ లో ఉన్నారు. అయితే మంత్రులుగా దూసుకెళుతున్న వీరికి నెక్స్ట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. గత ఎన్నికల్లోనే నగరిలో రోజాకు టఫ్ ఫైట్ ఎదురైంది. జగన్ వేవ్ వల్ల తక్కువ మెజారిటీతో బయటపడ్డారు…ఇప్పుడు మంత్రి అయ్యారు.

కానీ ఈ సారి రోజాకు గెలుపు ఈజీ కాదని తెలుస్తోంది…నగరిలో టీడీపీ బలపడుతుంది..అటు సొంత పార్టీ వాళ్లే రోజాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇటు రజినికి ఈ సారి చిలకలూరిపేటలో విజయం అంత ఈజీ కాదని విశ్లేషణలు వస్తున్నాయి…అక్కడ టీడీపీ సీనియర్ ప్రత్తిపాటి పుల్లారావు పుంజుకున్నారు. ఇక కొవ్వూరులో హోమ్ మంత్రి వనిత గెలుపు కూడా డౌటే అనే పరిస్తితి…కొవ్వూరు టీడీపీకి కంచుకోట..పైగా జనసేన కలిస్తే…వనిత విజయం కష్టమే. అలాగే కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీకి పాజిటివ్ అనుకున్నంత లేదని తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే నలుగురు మహిళా మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పొచ్చు.