నూత‌న ప్ర‌సాద్ కెరీర్‌ను క్లోజ్ చేసిన సంఘ‌ట‌న ఇదే… ఆ సినిమా షూటింగ్‌లో ఏం జ‌రిగింది..!

నూతన ప్రసాద్.. దాదాపు 30 సంవత్సరాలకు పైగా చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్విరామంగా నటించి తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటులు నూతన ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తెలుగు సినిమాలలో పనిచేయడమే కాకుండా తెలుగు థియేటర్లలో కూడా పనిచేశారు. 1970 లలో చలనచిత్ర నటన జీవితాన్ని ప్రారంభించిన ఈయన 4 రాష్ట్ర నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. నూతన ప్రసాద్ నటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టినప్పటికీ విలన్ గా, హాస్యనటుడిగా ఎన్నో పాత్రలతో 100 చిత్రాలలో నటించారు. ముఖ్యంగా హాస్యాన్ని ప్రధానంగా చేసుకొని ఈయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతేకాదు తన సినిమాలతో నూటొక్క జిల్లాల అందగాడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు నూతన ప్రసాద్.Nutan Prasad - Alchetron, The Free Social Encyclopedia

ఇదిలా ఉండగా.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈయన మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న సమయంలో ఒక సినిమా కారణంగా ఆయన జీవితమే నాశనం అయిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా ఏమిటంటే 1989 లో రాజేంద్రప్రసాద్ హీరోగా .. నూతన ప్రసాద్, భానుమతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం బామ్మ మాట బంగారు బాట. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఘోరం జరిగిపోవడంతో ఆయన జీవితం కూడా పూర్తిగా నాశనం అయ్యింది . ఇక ఆ తర్వాత ఆయన వీల్ చైర్ కే పరిమితం కావాల్సి వచ్చింది.Comedy Kings - Nutan Prasad Hilarious Comedy Scene - Nutan Prasad - video  Dailymotion

అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్లో భాగంగానే కార్లో కూర్చున్న నూతన ప్రసాద్ ను ఒక జెసిబి కారును పైకి ఎత్తే సన్నివేశం అది. కానీ అనుకోకుండా చైన్లు తెగిపోవడంతో పైనుంచి ఒక్కసారిగా కారుతో సహా నూతన ప్రసాదు కూడా కిందపడ్డారు. ఇక ఆ సమయంలోనే ఘోర ప్రమాదం జరిగి ఆయన వెన్నెముక విరిగిపోయింది. ఇక ప్రమాదం వల్ల శరీరం నడుము నుండి కిందకి పక్షవాతానికి గురై ఆయన జీవితం వీల్ చైర్కే పరిమితమైంది.ఇక అలా తన కెరియర్ ని నాశనం చేసుకున్నప్పటికీ ఫుల్ టైం సినిమాలలో కాకుండా అతిథి పాత్రలు.. అది కూడా వీల్ చైర్ లో ఉండే పాత్రలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.