సైకిల్ సీనియర్లు ఈసారి గట్టెక్కేనా?

గత ఎన్నికల్లో జూనియర్లు లేరు…సీనియర్లు లేరు…అందరూ జగన్ గాలిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే…జగన్ వేవ్ లో దారుణంగా ఓడిపోయారు. జూనియర్లు ఓడిపోతే పర్లేదు…ఎప్పుడు ఓటమి ఎరగని నేతలు కూడా చిత్తుగా ఓడిపోయారు. ఇలా జగన్ వేవ్ లో ఓడిన సీనియర్లు ఈ సారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు..ఈ సారి గాని గెలవకపోతే తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడటం గ్యారెంటీ అని భావిస్తున్నారు…ఇవే చివరి ఎన్నికలు అన్నట్లు వారు గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.

నెక్స్ట్ ఎలాగైనా గెలవాలని చూస్తున్న సీనియర్లలో కిమిడి కళా వెంకట్రావు, అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర, యరపతినేని శ్రీనివాస్ రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బి‌కే పార్థసారథి, మీనాక్షి నాయుడు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి…ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పలువురు సీనియర్లు నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులు చూస్తుంటే పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఏమి లేవు..నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.  కాసేపు టీడీపీ పుంజుకున్నట్లే కనిపిస్తున్నా సరే…అనూహ్యంగా అధికార బలం ఉన్న వైసీపీ ముందు ఉన్నట్లు కనిపిస్తోంది. కాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో వీరిలో కొందరు సీనియర్లకు గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. వారి వారి స్థానాల్లో స్ట్రాంగ్ అయ్యారు…అలాగే స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం…టీడీపీ సీనియర్లకు ప్లస్ అవుతుంది.

ఇంకా కష్టపడి పనిచేస్తే ఎన్నికల నాటికి మరికొందరు సీనియర్లు బలపడే అవకాశాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఉన్నంతగా ఈ సారి జగన్ వేవ్ ఉండేలా లేదు..కాబట్టి ఈ సారి కొందరు సీనియర్లు గెలిచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంతమంది సైకిల్ సీనియర్లు ఈ సారి గట్టెక్కుతారో చూడాలి.