నాదెండ్లకు సైకిలే దిక్కు?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు లేకపోతే..చాలామంది నేతల గెలుపు అవకాశాలు తగ్గుతాయని చెప్పొచ్చు…ఇటు టీడీపీ గాని, అటు జనసేన నేతలకు గాని పొత్తు అనేది చాలా ముఖ్యమని చెప్పొచ్చు…పొత్తు లేకపోతే గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నేతలు గెలుపోటముల అవకాశాలు పొత్తు మీదే ఆధారపడి ఉన్నాయి.

ఇదే క్రమంలో జనసేనలో పవన్ తర్వాత నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ రాజకీయ భవిష్యత్ కూడా పొత్తు మీదే ఆధారపడి ఉంది. గత ఎన్నికల్లోనే పొత్తు ఉంటే పవన్, నాదెండ్ల గెలిచేవారు. ఈ సారి ఎన్నికల్లో పవన్ ఇమేజ్ ఇంకాస్త పెరిగింది కాబట్టి…ఆయనకు పొత్తు లేకపోయినా గెలిచే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. కానీ నాదెండ్ల గెలవాలంటే ఖచ్చితంగా టీడీపీతో పొత్తు ఉండాల్సిందే. టీడీపీ బలం బట్టే నాదెండ్ల గెలవగలుగుతారు.

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తెనాలిలో ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల..అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేశారు. తర్వాత రాష్ట్ర విభజనతో రాజకీయాలకు కాస్త దూరమైన నాదెండ్ల తర్వాత జనసేనలోకి వచ్చి…నెంబర్ 2 నేతగా ఎదిగారు. అలాగే 2019 ఎన్నికల్లో తెనాలిలో పోటీ చేసి 30 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి 94 వేలు, టీడీపీకి 76 వేల ఓట్లు పడ్డాయి. అంటే వైసీపీ-టీడీపీలకు జనసేన ఎంత దూరంలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అదే సమయంలో గత ఎన్నికల్లో పొత్తు ఉండి…ఈ సీటు జనసేనకు దక్కి నాదెండ్ల పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవారు…ఇక వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న సరే టీడీపీ సపోర్ట్ కావాల్సిందే…ఒకవేళ పొత్తు ఉంటే… తెనాలి కాకపోయినా…గుంటూరు వెస్ట్ లో పోటీ చేసిన నాదెండ్లకు గెలుపు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పొత్తు లేకపోతే మళ్ళీ నాదెండ్లకు ఇబ్బందే. మొత్తానికైతే టీడీపీతో పొత్తుపైనే నాదెండ్ల గెలుపు ఆధారపడి ఉంది.