ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిచ్చా సుదీప్..!!

కిచ్చా సుదీప్.. రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా.. సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఈగ చిత్రం ద్వారా విలన్ గా తన కెరీర్ లో ఎంతో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కిచ్చా సుదీప్ తాజాగా నటిస్తున్న చిత్రం విక్రాంత్ రోణా.. ఇకపోతే అనూప్ బందేరి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా కన్నడ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో జూలై 28వ తేదీన విడుదల అయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కొంతవరకు పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటూ ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో నిరూప్ బండారి తో పాటు నీతో అశోక్ అలాగే జాక్వేలిన్ ఫెర్మాండేజ్ లు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా అందులో తన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు సుదీప్.

నిజానికి కిచ్ఛా సుదీప్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానమని అందరికీ తెలిసిందే .ఇక ఈ సందర్భంగా ఆయన మరొకసారి తన ఫేవరెట్ స్టార్ హీరోను తలచుకోవడం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని ఎంతో అద్భుతంగా నటిస్తారు అని చెప్పుకొచ్చిన సుదీప్ , ఎన్టీఆర్ కష్టపడే తీరు అందరికీ నచ్చుతుందని వెల్లడించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలసి నటించడం అంత సులభం కాదు అని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఇకపోతే కొమరం భీం పాత్ర కోసం ఎన్టీఆర్ మారిన తీరు చాలా అద్భుతం అని, ఇక ఆ పాత్రతో ఆయన మరో సక్సెస్ ని దక్కించుకున్నారు అని తెలిపారు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలో కిచ్చా సుదీప్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక విస్పోటనం లాంటివారు.. చాలా ఎనర్జిటిక్.. హై వోల్టేజ్.. రెడ్ బుల్.. గ్లూకోస్.. ఎలక్ట్రోల్ అంటూ చాలా పవర్ఫుల్ పదాలను ఉపయోగించి మరి ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇక సైలెంట్ గా ఉండే ఎన్టీఆర్ తన నటనతో ఎప్పుడు ఉగ్రరూపం చూపిస్తారో చెప్పడం చాలా కష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయనతో నటించేటప్పుడు అంటూ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతూ ఉండడమే కాకుండా ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు