బాలయ్య 108 మూవీలో సోనాక్షి సిన్హా.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!!

ఐదు పదుల వయసులో కూడా బాలకృష్ణ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా ఆయన తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే అఖండ వంటి బ్లాక్ బాస్టర్ మూవీ తో అత్యంత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన.. మరొకసారి మాస్ ఎలివేషన్స్ తో కూడిన అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే కర్నూల్లోని కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు బాలయ్య.Sonakshi Sinha issues clarification on Balarkishna's project - Telugu7am  English | DailyHunt

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య నటించబోయే తన 108వ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ బాగా వైరలవుతోంది.. అసలు విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రంలో బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించబోతున్నారు. ప్రముఖ కన్నడ హీరోయిన్ శ్రీ లీల ఆయన కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు వార్తలు వెలువుడుతున్నాయి. ఈ పాత్ర కోసం గతంలో ప్రియమణి పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చినా కానీ ఇప్పుడు మాత్రం చిత్ర బృందం సోనాక్షిని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట.

ఇక త్వరలోనే ఆమెకు కథ వినిపించనున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం సోనాక్షి సిన్హా నటించిన డబుల్ ఎక్స్ఎల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఒకవేళ బాలయ్య సినిమాకి సోనాక్షి సిన్హా ఒప్పుకుంటే ఇక బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టిస్తుంది ఈ మూవీ అని అభిమానుల సైతం తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.