గోదావ‌రి బాధ‌లు ప‌వ‌న్‌కు ప‌ట్ట‌వా… జ‌న‌సేన ఏమైపోయింది…!

ఔను.. ఇంత జ‌రుగుతున్న జ‌న‌సేన ఏమైన‌ట్టు.. ఆ పార్టీ నాయ‌కులు ఏం చేస్తున్న‌ట్టు? ఇదీ.. ఇప్పుడు ప్ర శ్న‌. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. ఇత‌ర వ‌ర్గాల్లోనూ జోరుగా వినిపిస్తున్న మాట‌. ఎందుకంటే.. జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా.. రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. స‌మ‌యానికి ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు పార్టీ శ్రేణులు. అదే.. గోదావ‌రి జిల్లాల్లో.. సంభ‌వించిన వ‌ర‌ద‌లు.. త‌ర్వాత‌.. ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నాయి.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు రెండోసారి కూడా ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ వ‌చ్చి రెండు రోజులు ప‌ర్య‌టించి వెళ్లారు. మ‌రి జ‌న‌సేనాని అడ్ర‌స్ ఎక్క‌డ‌? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం.. చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఏం చేస్తున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల కూడా.. కౌలు రైతుల కుటుంబాల‌కు న్యాయం చేస్తానంటూ.. ఆయ‌న ప‌ర్య‌ట‌న లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇది మంచిదే.

అయితే.. ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద‌లు మిగిల్చిన క‌ష్టంతో క‌న్నీటి వ‌ర‌ద పారుతున్న ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించా ల్సిన అవ‌స‌రం జ‌న‌సేనకు కూడా ఉంద‌నేది.. ప‌రిశీల‌కుల మాట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పార్టీ పుంజుకోవాలం టే.. ఖ‌చ్చితంగా.. ఇలాంటి స‌మ‌యాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ స‌మ‌యంలో బాధితుల‌కు భ‌రోసా నింపాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. అదేస‌మ‌యంలో స‌ర్కారు త‌ప్పుల‌ను ఎత్తి చూప‌డం ద్వారా.. బాధితుల ప‌క్షాన నిలబ‌డిన‌ట్టు కూడా అవుతుంది.

అయితే.. ఈ విష‌యంలో ప‌వ‌న్ ఎక్క‌డో విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో విశాఖ పాలిమ‌ర్స్ గ్యాస్ వివాదంలోనూ.. ప‌వ‌న్ పెద్దగా రియాక్ట్ కాలేదు. అదేవిధంగా గోదావ‌రిలో ప‌డ‌వ మునిగి.. 25 మంది వ‌ర‌కు మునిగి చ‌నిపోయిన ఘ‌ట‌న‌పైనా.. ఆయ‌న స్పందించ‌లేదు. మ‌రి.. ఇలాంటి సంద‌ర్భంలో.. ప్ర‌జ‌లు.. నాయ‌కుల నుంచి భ‌రోసా ను కోరుకుంటార‌నే విష‌యం ఆయ‌న‌కు తెలియ‌ద‌ని అనుకోవాలా? లేక‌.. ఆయ‌న ఇప్పుడు ఎందుకులే.. అని అనుకుంటున్నారో.. అర్ధం కావ‌డం లేద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

పోనీ.. ప‌వ‌న్‌కు కుద‌ర‌క‌పోతే.. త‌న పార్టీత‌ర‌ఫునైనా.. ఆయ‌న సైనికుల‌ను రంగంలోకి దింపి.. ప‌నిచేయించే ప్ర‌య‌త్నం చేయొచ్చు. ఆర్థికంగా కాక‌పోయినా.. సేవ‌లైనా అందించే అవ‌కాశం ఉంటుంది. కానీ.. ఇవేవీ చేయించ‌డం లేదు. మ‌రి ఇది రేపుఅధికార ప‌క్షం నుంచి విమ‌ర్శ‌ల‌కు.. తావిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.