జగన్ ప్రత్యర్ధి టార్గెట్ రీచ్ అవుతారా?

పులివెందుల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అని ముద్రపడిపోయింది…ఇక్కడ ఆ ఫ్యామిలీని ఓడించడం జరిగే పని కాదు..వైఎస్సార్, వైఎస్ వివేకా, విజయమ్మ…ఇప్పుడు జగన్ అక్కడ సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి ఎప్పటినుంచో వైఎస్సార్ ఫ్యామిలీపై పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి పులివెందులలో జగన్ ని ఓడించడం కలలో కూడా జరిగే పని కాదు.

కానీ ఇక్కడ ఒక్కటి జరిగితే మాత్రం టీడీపీకి గెలిచినంత ఆనందం వస్తుందని చెప్పొచ్చు. అదేంటి అంటే…పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గించగలిగితే చాలు టీడీపీ సత్తా చాటిందని అనుకోవచ్చు. గత రెండు ఎన్నికల్లో జగన్…భారీ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. 2014లో 75 వేల ఓట్ల మెజారిటీతో…2019లో 90 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు…పులివెందుల ఇదే అత్యధిక మెజారిటీ. పైగా గత ఎన్నికల్లో వచ్చిన అతి పెద్ద మెజారిటీ కూడా ఇదే.

ఇక ఇక్కడ జగన్ మెజారిటీ తగ్గిస్తే చాలు టీడీపీ సక్సెస్ అయినట్లే..కాకపోతే గత ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓడిపోయిన సతీశ్ రెడ్డి…టీడీపీని వదిలి రాజకీయాలకు దూరం అయ్యారు. దీంతో పులివెందుల ఇంచార్జ్ గా బీటెక్ రవిని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పై బీటెక్ రవి పోటీ చేయనున్నారు. బీటెక్ రవి ముందున్న ఏకైక టార్గెట్…జగన్ మెజారిటీ తగ్గించడం. గత ఎన్నికల్లో వచ్చిన 90 వేల మెజారిటీని తగ్గిస్తే రవి చాలావరకు సక్సెస్ అయినట్లే.

మరి ప్రస్తుతం పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గే పరిస్తితి ఉందా? అంటే ఇప్పుడైతే పెద్దగా ఆ పరిస్తితి కనిపించడం లేదు. కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఫుల్ గా ఉంది…అది ఇప్పుడు కాస్త తగ్గుతుంది కాబట్టి…నెక్స్ట్ ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భారీ స్థాయిలో మెజారిటీ తగ్గిస్తే పులివెందులలో బీటెక్ రవి సత్తా చాటినట్లే. మరి చూడాలి బీటెక్ రవి టార్గెట్ రీచ్ అవుతారో లేదో.