నో డౌట్..ఆ సీటు జనసేనదే..కానీ!

రాష్ట్రంలో బలపడాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కష్టపడుతున్నారు…గత ఎన్నికల్లో ఎలాగో విఫలమయ్యారు కాబట్టి…ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు..అందుకే గతం కంటే ఎక్కువగా యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్నారు…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు..వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు…పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని పవన్ అనుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వైసీపీ, టీడీపీలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి…ఆ రెండు పార్టీలని తట్టుకుని జనసేన ఎదగడం చాలా కష్టం. ఏదో కొన్ని స్థానాల్లో మాత్రమే జనసేన ప్రభావం చూపగలదు తప్ప…వైసీపీ-టీడీపీల మాదిరిగా జనసేన రాష్ట్రమంతా ప్రభావం చూపలేదు. కానీ జనసేనకు ఒక అడ్వాంటేజ్ ఉంది..ఆ పార్టీ అవసరం టీడీపీకి చాలా ఉంది…వైసీపీని ఓడించాలంటే…టీడీపీకి జనసేన అవసరం చాలా ఉంది.

అదే సమయంలో జనసేన సింగిల్ గా కంటే…టీడీపీతో కలిస్తే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి పొత్తుల గురించి పెద్దగా చర్చలు నడవటం లేదు గాని…ఎన్నికల నాటికి మాత్రం పొత్తుల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది…అయితే పొత్తు ఉంటే కొన్ని సీట్లు జనసేనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి..అలాంటి సీట్లలో విజయవాడ వెస్ట్ సీటు కూడా ఒకటి అని చెప్పొచ్చు. టీడీపీతో పొత్తు ఉంటే ఖచ్చితంగా ఈ సీటు జనసేనకే దక్కుతుంది..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 2014లో టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు…విజయవాడ వెస్ట్ సీటు…బీజేపీకి  దక్కింది.

ఇక నెక్స్ట్ పొత్తు  ఉంటే ఈ సీటు జనసేనకు దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి…పైగా ఇక్కడ జనసేన నేత పోతిన మహేష్ బాగా దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు…పొత్తు ఉంటే ఖచ్చితంగా ఈ సీటు జనసేనకే. అలాగే విజయం కూడా ఈజీ. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, వైసీపీపై 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది…అలాగే ఇక్కడ జనసేనకు 25 వేల ఓట్ల వరకు వచ్చాయి. కాబట్టి టీడీపీతో పొత్తు ఉంటే ఈ సీటు జనసేన గెలవడం ఖాయమని చెప్పొచ్చు.