వివాహానికి సిద్ధమైన అనుష్క.. వరుడు అతడే..!!

సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనుష్క మొదటి సినిమాతోనే తన ప్రతిభను ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె ప్రభాస్ తో కలసి పండించిన రొమాన్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు మరిచిపోలేరని చెప్పాలి. ఇకపోతే కోడి రామకృష్ణ లాంటి ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో అరుంధతి లాంటి సెన్సేషనల్ సినిమాలను కూడా తెరకెక్కించి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనుష్క.. ఆ తర్వాత బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలలో కూడా నటించి మరెంతో ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బాహుబలి సినిమా వరకు వరుస సినిమాలు చేస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. వయసు 40 సంవత్సరాలు అవుతున్నా వివాహానికి మాత్రం దూరంగా ఉండిపోయింది.This is what Anushka Shetty is having in mind about her marriage

ఇకపోతే గత ఏడాది ప్రముఖ జ్యోతిష్కుడు ఈమె జాతకం చూసి కచ్చితంగా 2023లో వివాహం చేసుకుంటుంది అని , అది కూడా సినీ ఇండస్ట్రీకి చెందని వ్యక్తిని వివాహం చేసుకుంటుంది అని ఆయన జ్యోతిష్యం చెప్పాడు. ఇక జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే గతంలో వివాహం చేసుకోవడం ఇష్టం లేక కొద్ది రోజులపాటు కుటుంబానికి దూరంగా ఉన్న అనుష్క బాగా విహారయాత్రలు చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. ఇక భాగమతి సినిమా తర్వాత రెండు మూడు సినిమాలలో మాత్రమే నటించింది. ఇక తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయి ఎక్కడా.. ఎవరితోనూ టచ్ లో లేకపోవడం గమనించదగ్గ విషయం. కానీ ఇటీవల యంగ్ హీరో జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చింది కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడం గమనార్హం.

ఇక దీంతో ఎట్టకేలకు బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను అనుష్క వివాహం చేసుకోబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఎట్టకేలకు 40 సంవత్సరాల వయసులో జేజమ్మ ఒక ఇంటి వారు అవుతుండడంతో ఆమె అభిమానుల సైతం వర్షం వ్యక్తం చేస్తున్నారు.