ఆ రెడ్లు టీడీపీలోకి రిటర్న్?

ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి…ఇంకో ఏడాదిన్నర సమయం ఉన్నా సరే ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీలు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత కొద్దిరోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తూ…టీడీపీ శ్రేణులని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు…అలాగే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వస్తున్నారు.

ఇదే క్రమంలో ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్ సైతం పార్టీపై ఫోకస్ పెట్టారు..ఇప్పటికే ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళి పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు..సరిగ్గా పనిచేయని వారికి సీటు ఇవ్వనని చెప్పేశారు…అలాగే నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యి…ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకోనున్నారు. ఇలా జగన్, చంద్రబాబు ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

ఇక పార్టీ బలోపేతానికి ఆపరేషన్ ఆకర్ష్ కూడా తెరలేపనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు…వైసీపీలో బలంగా ఉన్న నాయకులని లాగడానికి చూస్తున్నారని సమాచారం. ముఖ్యంగా వైసీపీ బలంగా ఉన్న స్థానాలపై బాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.  అలాగే వైసీపీకి మొదట నుంచి అండగా ఉంటున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలని టీడీపీలోకి తీసుకొస్తారని ప్రచారం జరుగుతుంది.

వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు బాబు వల వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణరెడ్డి, మానుగుంట మహిధర్ రెడ్డి…ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే మాగుంట పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేశారు.

తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, ఇదంతా టీడీపీ కుట్ర అని అంటున్నారు…కానీ ఆనం, మానుగుంటల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అదే సమయంలో గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎస్వీ మోహన్ రెడ్డిని సైతం మళ్ళీ టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీలోకి తీసుకొచ్చి కర్నూలు సిటీ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఎంతమంది రెడ్డి నేతలు టీడీపీలోకి వస్తారో.