పొత్తు: కల్యాణ్ బాబు-చినబాబుకు ప్లస్సే!

గత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సీట్లలో గాజువాక, భీమవరం, మంగళగిరి సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో తొలిసారి పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీ చేశారు. గాజువాక, భీమవరంల్లో పవన్..మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు.  అయితే ఇద్దరు నేతలు జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇలా తొలిసారి పోటీ చేసి ఇద్దరు నేతలు ఓడిపోయారు.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ చినబాబు…మంగళగిరిలో పోటీ చేయడం ఖాయమే…ఓడిపోయిన దగ్గర నుంచి అక్కడ పనిచేస్తూ వస్తున్నారు…అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాటం చేస్తున్నారు…ఏదొక కార్యక్రమం చేస్తూ మంగళగిరి ప్రజల మధ్యలోనే చినబాబు ఉంటున్నారు. తాజాగా కూడా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరిలో చినబాబుకు ప్రజాదరణ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.

పైగా అమరావతి ప్రభావం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మైనస్ అవుతుంది…అలా అని ఆళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి లోకేష్ ఇంకా బలపడాల్సి ఉంది. అదే సమయంలో జనసేనతో గాని పొత్తు ఉంటే..మంగళగిరిలో లోకేష్ ఈజీగా గెలుస్తారు. గత ఎన్నికల్లో జనసేనలో పొత్తులో భాగంగా మంగళగిరిలో సి‌పి‌ఐ పోటీ చేసి 10 వేల ఓట్లు వరకు తెచ్చుకుంది…కానీ చినబాబు 5 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అంటే అప్పుడే పవన్ తో పొత్తు ఉంటే లోకేష్ గెలిచేవారు.

అలాగే పవన్ సైతం రెండు చోట్ల ఓటమి పాలయ్యారు..అప్పుడు టీడీపీ గాని…పవన్ కు సపోర్ట్ చేసి ఉంటే…పవన్ రెండు చోట్ల గెలిచేవారు. అయితే ఇప్పటికీ పవన్ సీటు ఫిక్స్ కాలేదు…ప్రస్తుతం జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..పవన్ మళ్ళీ భీమవరంలో పోటీ చేయొచ్చని తెలుస్తోంది…ఈ సారి పవన్ కు గెలుపు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి..కాకపోతే టీడీపీతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా గెలిచేస్తారని చెప్పొచ్చు. మొత్తానికి పొత్తు ఉంటే…పవన్, లోకేష్ తొలి విజయాలు అందుకునే ఛాన్స్ ఉంది.