కృష్ణాలో తమ్ముళ్ళు ఇలా ఉన్నారేంటి!

ఓ వైపు చంద్రబాబు వయసు మీద పడిన సరే…పార్టీని గాడిలో పెట్టడానికి నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు..మళ్ళీ పార్టీని అధికారంలోకి రావాలని చెప్పి కృషి చేస్తున్నారు..అధికార వైసీపీపై తీవ్రంగా పోరాడుతున్నారు…ప్రజల్లో ఉంటూ…వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి అధికారంలోకి రాకపోతే టీడీపీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోతుందనే సంగతి బాబుకు అర్ధమవుతుంది…అందుకే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నానా తిప్పలు పడుతున్నారు.

చంద్రబాబు ఏమో అలా కష్టపడుతుంటే…కింద ఉన్న టీడీపీ నేతలు మాత్రం అందుకు తగ్గట్టు కష్టపడటం లేదు. పైగా ఎవరికి వారు ఆధిపత్య పోరులో బిజీగా ఉన్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని చెప్పి ప్రయత్నిస్తూ…సొంత పార్టీనే ముంచాలని చూస్తున్నారు. దాదాపు అన్నీ జిల్లాల్లో టీడీపీలో వర్గ పోరు గట్టిగానే జరుగుతుంది. ఇక టీడీపీకి కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా తమ్ముళ్ళ మధ్య వర్గ పోరు ఎక్కువగానే ఉంది. జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తుంది.

మొదట నుంచి విజయవాడలో టీడీపీ నేతల మధ్య పోరు తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్యలతో ఎంపీ కేశినేని నానికి పొసగడం లేదు. ఇక వారు కూడా కేశినేనికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇటు కేశినేని ఫ్యామిలీలో కూడా చిచ్చు రేగిన విషయం తెలిసిందే.

అటు తిరువూరులో మాజీ ఎమ్మెల్యే స్వామీదాస్, కొత్త ఇంచార్జ్ దేవదత్ వర్గాలకు పడటం లేదు. నూజివీడులో ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరావు, టీడీపీ కమ్మ నేతలకు పొసగడం లేదు. గుడివాడలో ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, శిష్ట్లా లోహిత్ వర్గాల మధ్య పోరు నడుస్తోంది. పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, యలమంచిలి రాజేంద్రప్రసాద్, దేవినేని గౌతమ్ వర్గాల మధ్య రగడ నడుస్తుంది. పెడనలో ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్..పెడన మున్సిపాలిటీ టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కైకలూరులో కూడా టీడీపీలో గ్రూపు రాజకీయం నడుస్తోంది. ఇలా కృష్ణా జిల్లాలో తమ్ముళ్ళు వర్గ పోరులో బిజీగా ఉంటూ…టీడీపీని ఇంకా దెబ్బకొడుతున్నారు.