ఆచార్య అందుకే ప్లాప్ అయ్యింది.. ఆ సీక్రెట్ బ‌య‌ట పెట్టిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో కి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో.. వినయ విధేయతలతో.. ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా సరే.. ముందుగా స్పందిస్తూ తనదైన మార్కును చాటుకున్నాడు చిరంజీవి. ఇకపోతే ఈయన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించడానికి తెరకెక్కిస్తూ ఉంటాను అని చిరంజీవి గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోని ప్రేక్షకులను మెప్పించడానికి ఈసారి ఏకంగా తన కొడుకుతో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ క్రమం లోనే చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య చిత్రం భారీ డిజాస్టర్ కావడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ పై తాజాగా చిరంజీవి స్పందించినట్లు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.Acharya turns out to be box office disaster; Chiranjeevi, Ram Charan plan  to compensate investors | Trending News – India TV

నిన్నటి రోజున హైదరాబాదులో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కావడం జరిగింది. దీంతో తను నటించిన ఆచార్య సినిమా ప్లాప్ పై పరోక్షంగా కామెంట్ చేశారు చిరంజీవి.. చిరంజీవి మాట్లాడుతూ.. ప్రేక్షకులను అలరించేందుకు.. మెప్పించేందుకు సినిమాలు చేయడం అంటే తనకు చాలా ఇష్టమట.. అయితే తను రిస్క్ లేని మార్గాన్ని ఎంచుకుంటానని ..కానీ ఇటీవల అనుకున్నట్లుగా ఏదీ జరగలేదని.. ఆ తప్పు గురించి తను ఏమీ మాట్లాడలేను అని కూడా తెలిపారు. దీంతో పరోక్షంగా ఆచార్య సినిమా ఫలితం పైన ఆయన కామెంట్ చేయడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా మలయాళం లూసిఫర్ సినిమా నీ గాడ్ ఫాదర్ సినిమాగా రీమిక్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.