వారెవ్వా: తెలుగు సినిమా చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డ్ సాధించిన RRR..!!

RRR సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇంతకముందు ఎన్నో సినిమాలు తీసి ఉండచ్చు జక్కన్న, అవి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యుండచ్చు..కానీ ఇప్పుడు సాధించిన రికార్డ్..చరిత్రలో గుర్తుండిపోయేది. ఇప్పటికి వరకు ఏ సినిమా నెలకోల్పని రికార్డ్..ఇక పై మరే సినిమా కూడా టచ్ చేయలేని రికార్డ్ ను క్రియేట్ చేశాడు రాజమౌళి. టాలీవుడ్ బడా హీరోలు అయిన చరణ్-తారక్ లను పెట్టి..ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించిన రణం రౌద్రం రుధిరం మూవీ..మార్చి 25 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరిత్రనే తిరగ రాసింది.

స్టోరీ తెలిసిందే అయినా..రాజమౌళి మ్యాజిక్ ..విజువల్ ఎఫెక్ట్స్..ఈ సినిమాకోసం ఆయన కష్టపడ్డ తీరు ..తెర పై సినిమా చూసిన ప్రతి ఒక్కరిసి స్పష్టంగా అర్ధమైంది. రొమాన్స్, కామెడీ పెద్దగా లేకపోయినా ..జక్కన్న అనుకున్న కధని పక్కాగా క్లారిటీ గా అర్ధమైయేలా జనాలకు చూయించాడు. అంతేకాదు సినిమా తీసేశాం విడుదల చేస్తాం రిజల్ట్ దేవుడి కే వదిలేస్తాం అని కాకుండా..ప్రతి భాషలో ఆయన సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఆ విషయంలో రాజమౌళి ని మించిన డైరెక్టర్ లేడు రాడు..రాబోడు..అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కాగా, ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల సునామి సృష్టిస్తుంది. ఇప్పటికే పాత రికార్డులను చేరిపేసి కొత్త రికార్డులను రాసుకున్న RRR.. దాదాపు 1000 కోట్లకు చేరువలో ఉంది. కాగా, రీసెంట్ గా మరో సంచలన రికార్డ్ తన పేరిట నమోదు చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డ్ గా నైజాం లో ఈ సినిమా 100 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఇలాంటి రికార్డ్ నెలకొల్పలేదు. ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోగా, ఆయనకీ రూ. 30 కోట్ల లాభం వచ్చిందని తెలుస్తోంది. ఇటీవల చిత్ర యూనిట్‌‌కి దిల్ రాజు కూడా భారీగా పార్టీ కూడా ఇచ్చారు. ఆ పార్టీలో రాజమౌళి డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి నాటు నాతు పాటకి స్టెపులు కూడా వేశారు. హిస్టారికల్ గా ఈ ఒక్క ఏరియా నుంచే ఏకంగా 100 కోట్లు షేర్ రాబట్టిన ఏకైక తెలుగు సినిమాగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది RRR. మరి మళ్ళీ ఈ మార్క్ ఏ సినిమా ఎన్నాళ్ళకి బ్రేక్ చేస్తుందో చూడాలి. కాగా RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కించిగా ఈ మూవీలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు.