కెరీర్ లోనే ఇప్పటివరకు చేయని బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న తారక్..సక్సెస్ అయ్యేనా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు కి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు తారక్. NTR కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా నే RRR సినిమాతో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ కొమురం భీమ్..ప్రజెంట్ RRR ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా, మరి కొద్ది రోజుల్లోనే డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో #NTR 30 సినిమాను ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో తారక్ లుక్స్..స్టైల్ కొత్త గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. దానికోసం చరణ్..చాలా కష్టపడుతున్నారు కూడా. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయాని ఆమె స్వయంగా చెప్పుకు రావడం విశేషం . ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్షన్ లో ఓ సినిమా ను చేయబోతున్నాడు తారక్.

నిజానికి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కించాల్సి ఉంది. కానీ తారక్ RRR షూటింగ్ లో బిజీ గా ఉండటం..కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడుతూ రావడంతో.. బుచ్చి బాబు సినిమా లేట్ అయ్యింది. వీలైనంత త్వరగా.. కొరటాల తో సినిమా కంప్లీట్ చేసి..బుచ్చి బాబు సినిమాను లైన్లో పెట్టనున్నాడు NTR. కాగా , ఈ సినిమా లో ఫస్ట్ టైం తారక్ మనకు దివ్యాంగుడి పాత్రలో కనిపించనున్నట్లు షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటివరకు తారక్ టచ్ చేయని కొత్త జోనర్ లో ఈ సినిమా ఉండబోతుందట. Sports డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టోరీ కొత్తగా ఉండటంతో.. తారక్ కు బాగా నచ్చడంతో కొంచెం రిస్క్ అయినా ఈ పాత్రకి తారక్ గ్రీన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తారక్ ని అలాంటి క్యారెక్టర్ లో అభిమానులు లైక్ చేస్తారో లేదో అనేది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. కానీ కొందరు అభిమానులు మాత్రం నటుడు గా రాణించాలంటే అన్ని వేరియేషన్స్ చూయించాలి.. తారక్ తీసుకున్న నిర్ణయం కరెక్టే..ఆ పాత్ర చేసే సత్తా తారక్ కి ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి తారక్ ఈ సినిమా ద్వారా సక్సెస్ అవుతారో లేదో తెలియాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే..!!