ఫైనల్ లిస్ట్ రెడీ … వైసీపీలో కొత్త మంత్రులుగా వీళ్లే ?

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి 2019లో ప్ర‌బుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే. రెండున్న‌రేళ్ల‌కు త‌న మంత్రి వ‌ర్గాన్ని 90 శాతం వ‌ర‌కు మార్పుచేస్తాన‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. దీంతో అప్ప‌టి కే మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆశించిన వారు.. ఈ ప్ర‌క‌ట‌న‌తో నెమ్మ‌దించారు. జ‌గ‌న్ మాట ఇస్తే.. త‌ప్ప‌రు..అన్న విధంగా ఆయ‌న మాట ఎప్పుడు నెర‌వేర్చుకుంటారా? అని వీరు ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు.. మంత్రుల జాబితాలో రోజు రోజుకు పేర్లు పెరుగుతున్నాయి.

ఫైర్ బ్రాండ్లు, పార్టీలో దూకుడుగా ఉండేవారు.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు.. ఎస్సీ, ఎస్టీల్లో పేరు తెచ్చు కున్న‌వారు.. ఇలా.. అనేక‌మంది మంత్రి ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురుచూస్తున్న వా రు.. ఎప్ప‌టి నుంచో మ‌రింత దూకుడు పెంచారు. త‌మ‌కు పోటీ వ‌స్తారు…అని అనుకున్న నేత‌ల‌కు దీటుగా త‌మ స‌త్తా చూపిస్తున్నారు. ఇలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం… ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ముందు వ‌రుస‌లో ఉన్నారు. వీరిద్ద‌రూకూడా.. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు.

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును తీసుకుంటే.. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. మేదావిగా ఆయ‌న గుర్తిం పు పొందారు. అయిన దానికీ.. కానిదానికీ.. ఆయ‌న నోరు చేసుకోరు. ఆయ‌న మాట్లాడారంటే..ఇక ఎవ‌రికీ వాయిస్ ఉండ‌దు.. అనేలా పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డిరాష్ట్రంలో ఆయ‌న కీల‌క‌మైన రెవెన్యూ శాఖ‌కు మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ స‌ర్కారులోనూ ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఇస్తుంద‌న‌ని అనుకున్నా.. ఆయ‌న సొద‌రుడు.. కృష్ణ‌దాస్‌కు మంత్రి ప‌ద‌వి వ‌రించింది. పైగా ఆయ‌న‌ను డిప్యూటీ సీఎంగా కూడా చేశారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడైనా.. అంటే.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అయినా.. త‌న‌కు ఛాన్స్‌ద‌క్క‌క‌పోతుందా? అని ఎదురు చూస్తున్నారు..కానీ, ఆయ‌న‌కు దూకుడు లేక‌పోవ‌డం.. కేడ‌ర్‌పైనా.. ప‌ట్టు సాధించ‌లేక పోవ‌డం వంటివి మైన‌స్‌లుగా మారాయి. ఇటీవ‌ల జిల్లాల విభ‌జ‌న స‌మ‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా జిల్లాలో ఈయ‌న ర్యాలీ చేప‌ట్టారు. అయితే.. ప‌ట్టుమ‌ని ప‌దిమంది కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ఆయ‌న స‌మీక‌రించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈయ‌న‌కు స్థానికంగా ప‌ట్టు లేద‌ని.. ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా? అనేది ప్ర‌శ్న‌.

ఇక‌, స్పీక‌ర్ త‌మ్మినేని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్నా.. ఈయ‌న త‌ర‌చుగా సీమ ట‌పాకాయ్ మాదిరిగా మాట‌ల తూటాలు పేలుస్తుంటారు. పైగా జ‌గ‌న్‌పై భ‌క్తి ఎక్కువ‌. ప్ర‌తిప‌క్షాల‌పై నిప్పులు చెర‌గ‌డంలోనూ ఈయ‌న స్టైల్ డిఫ‌రెంట్‌. ఇక‌, ఇటీవ‌ల జిల్లాల విభ‌జ‌న నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన ర్యాలీలో భారీ ఎత్తున కేడ‌ర్ను స‌మీక‌రించుకున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి కూడా రాజ‌కీయాల్లోనే ఉన్నారు. వెర‌సి.. దూకుడు జోరుగా ఉంది. మొత్తంగా చూస్తే.. ఈ జిల్లా నుంచి కొత్త‌గా ఎవ‌రినైనా మంత్రిప‌ద‌విలోకి తీసుకుంటే.. అది స్పీక‌ర్‌నేన‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.