బాలీవుడ్‌లో ఆ రికార్డు ఎప్ప‌ట‌కీ సీనియ‌ర్ ఎన్టీఆర్‌దే…!

తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వించదగ్గ నటుల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ పోషించిన విభిన్నమైన పాత్రలు ఇప్పటివరకు ఎవ్వ‌రూ చేయలేదు. కేవలం నటుడు మాత్రమే కాదు తిరుగులేని దర్శకుడుగా… నిర్మాతగా ఇలా ఎన్టీఆర్ ఎన్నో పాత్రలు పోషించారు. కేవలం సాంఘిక కథలలో మాత్రమే కాకుండా పౌరాణికం – చారిత్రాత్మక సినిమాల్లో కూడా ఎన్టీఆర్ నటించి మెప్పించాడు.
ఇక ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన రీమేక్‌ల‌లోనూ ఎన్టీఆర్ న‌టించిన‌వి అత్యధికం. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో తమిళ మాతృక నుంచి రీమేక్ అయిన చిత్రాలు ఎక్కువగా ఉండేవి.

ఆ తర్వాత కన్నడంతో పాటు బెంగాలీ సినిమాల రీమేక్ లో సైతం ఎన్టీఆర్ హీరోగా నటించారు. అప్పట్లో బాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెలుగులో సినిమాలు చాలా అరుదుగా ఉండేది. అయితే అప్పుడే బాలీవుడ్‌ సినిమాల స్ఫూర్తితో తెలుగులో వచ్చిన సినిమాలలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. 1958లో వచ్చిన సభా సినిమాతో ఈ ట్రెండ్ మొదలయ్యింది. ఆ తర్వాత 1949లో ఏ ఆర్ ఖాదర్ దర్శకత్వంలో మధుబాల – గీతా బాలి సురేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన తులాడీ సినిమాకు ఇది రీమేక్.

అంజలి దేవి హీరోయిన్‌గా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఆ తరువాత ఏడాది వచ్చిన మ‌రో సినిమా సైతం బాలీవుడ్ సినిమా బ‌డాబాయికు రీమేక్‌. అనంతరం హిందీలో వచ్చిన జిందగీ తెలుగులో ఆడబ్రతుకు పేరుతో తెరకెక్కింది. దుర్గంకి సాహో మే మూవీ రాముగాను, ప్రొఫెస‌ర్ మూవీ భ‌లే మాస్ట‌ర్‌గా, చైనాటైన్ భ‌లే త‌మ్ముడిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.

ఆ తర్వాత బాలీవుడ్ లో ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన జంజీర్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దానిని తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నిప్పులాంటి మనిషిగా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే యాదోంకి బారాత్ సినిమా అన్నదమ్ముల అనుబంధంగా – జానీ మేరా నామ్ ఎదురులేని మనిషిగా – డెవార్ మగాడుగా – డాన్ యుగంధర్ గా తెలుగులో తెరకెక్కాయి.

ఎన్టీఆర్ నటించిన ఆరాధన – నేరం నాది కాదు ఆకలిది – మా దైవం – మేలుకొలుపు – లాయర్ విశ్వనాథ్ – కేడి నెంబర్ వన్ – ఎదురీత లాంటి సినిమాలు అన్ని హిందీ రీమేక్‌లేనంటే ఇక ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ముందు నటించిన నాదేశం సినిమా కూడా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ లావారీష్‌కు రీమేక్ గా తెరకెక్కింది. ఏదేమైనా ఎన్టీఆర్ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల రీమేక్‌లో నటించారు. ఇవన్నీ చూస్తుంటే బాలీవుడ్ రీమేక్‌ల‌ ఈ రికార్డును మరే హీరో అందుకోలేదని చెప్పాలి.