మెగా బెగ్గింగ్‌తో అంద‌రూ హ‌ర్ట్‌…!

ఏపీ ప్ర‌భుత్వానికి, టాలీవుడ్‌కు మ‌ధ్య గ‌త కొంత కాలంగా న‌డుస్తోన్న కోల్డ్‌వార్‌కు ఇక్క‌డితో శుభం కార్డు ప‌డిన‌ట్టేనా ? తాజాగా టాలీవుడ్ ప్రముఖులు – ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌క్సెస్ అయిన‌ట్టేనా ? అన్న‌దానిపైనే ఇప్పుడు డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ – ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌, రాజ‌మౌళి వీళ్లంతా వెళ్లారు. చ‌ర్చ‌లు చాలా కూల్‌గా జ‌రిగాయ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన చిరంజీవి, ప్ర‌భాస్‌, మ‌హేష్ చెప్పారు.

వ‌చ్చే రెండు వారాల్లోనే కొత్త టిక్కెట్ రేట్ల‌తో పాటు ఐదో షోకు అనుమ‌తుల‌పై జీవోలు వ‌స్తాయ‌న్న ఆశ‌ల‌తో ఉన్నారు. అయితే ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి సీఎం జ‌గ‌న్‌ను మ‌రీ ఆయ‌న స్థాయి త‌గ్గించుకుని వేడుకుంటోన్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. జ‌గ‌న్‌కు వంగి దండం పెడుతూ చిరు వేడుకోవ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

అస‌లు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వెళ్లిన వారు ఇండ‌స్ట్రీ ప్ర‌తినిధులా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా వేస్తున్నారు. మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట‌కు ప్రతినిధిగా, రాజ‌మౌళి త్రిబుల్ ఆర్‌కు ప్ర‌తినిధిగా, ప్రభాస్ రాధేశ్యామ్‌కు ప్ర‌తినిధిగా, చిరంజీవి ఆచార్య‌కు ప్ర‌తినిధిగా వెళ్లారే త‌ప్పా వీళ్లెవ్వ‌రు ఇండ‌స్ట్రీ ప్రతినిధులుగా వెళ్ల‌లేద‌ని అంటున్నారు.

అయితే దీనిపై రాంగోపాల్ వ‌ర్మ కూడా స్పందించారు. ఈ మీటింగ్ తాలూకూ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన వ‌ర్మ మెగా ఫ్యాన్‌గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధ‌ప‌డ్డాను అని ట్వీట్ చేశాడు. కొద్ది రోజులుగా ఏపీలో టిక్కెట్ రేట్ల ఇష్యూపై వ‌ర్మ ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇక చిరు త‌మ్ముడు ప‌వ‌న్ ఇలా ఎప్పుడూ బెగ్గింగ్ చేయ‌డ‌ని .. అందుకే అత‌డు ఎక్కువ పాపుల‌ర్ అని వ‌ర్మ మ‌రో ట్వీట్ చేశాడు. చిరు ఇలా చేయ‌డం ఆయ‌న అభిమానుల‌కు కూడా న‌చ్చ‌లేద‌ని వ‌ర్మ వ‌రుస‌గా చేసిన ట్వీట్లు కొద్ది సేప‌టి త‌ర్వాత తొల‌గించాడు. అయినా వ‌ర్మ నిజం చెప్పాడంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.


Leave a Reply

*