రాజ‌కీయాల‌కు ఏపీ మంత్రి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌..?

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు సంవ‌త్స‌రాల టైం మాత్ర‌మే ఉంది. ఎక్క‌డ చూసినా పొలిటిక‌ల్ హీట్ మామూలుగా లేదు. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఈ సారి అధికార వైసీపీ నేత‌ల నుంచి కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు వెల‌వ‌డుతాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌ర‌నే అంటున్నారు. ఆయ‌న వ‌య‌స్సు మ‌రీ అంత ఎక్కువేం కాదు.. అయితే అనారోగ్యంతో ఉన్న ఆయ‌న గ‌తంలోలా యాక్టివ్‌గా ఉండలేక‌పోతున్నార‌ట‌. దీంతో రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అధికార పార్టీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌న త‌న‌యుడికి టిక్కెట్ ఇప్పించుకుని ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా దూరం జ‌ర‌గాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే బొత్స ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం అయినా కూడా .. రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా బొత్స సత్యనారాయణ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కొన‌సాగుతున్నారు. కీల‌క‌మైన శాఖ‌ల‌కే మంత్రిగా ఉన్న ఆయ‌న మాట ఇప్పుడు చెల్ల‌డం లేదు.. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు ఆయ‌న ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పేవారు.

అయితే ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్లో ఆయ‌న స‌ర్దుకుపోతున్నారు. ఇక జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న ఏం చెపితే అదే న‌డిచేది. అయితే ఇప్పుడు మేన‌ళ్లుడు అయిన మ‌జ్జి శ్రీను జ‌డ్పీ చైర్మ‌న్ అయ్యాక బొత్స ను కూడా కొన్ని సంద‌ర్భాల్లో హై క‌మాండ్ సైడ్‌చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలోనే త‌న‌ కుమారుడు బొత్స సందీప్ ను వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. సందీప్ వైద్య వృత్తిని అభ్యసించినా తల్లిదండ్రుల మార్గంలో రాజ‌కీయాల్లోనే న‌డ‌వాల‌ని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

సందీప్ ధీర పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కోవిడ్ సమయంలోనూ విజయనగరం జిల్లాలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. ఇక స్థానికంగా యువ‌త‌కు విద్యార్థుల‌కు ఎన్నో కార్య‌క్ర‌మాల ద్వారా అందుబాటులో ఉంటున్నారు. మొత్తానికి సందీప్ పేరు అయితే హైలెట్ అవుతోంది. మ‌రి బొత్స రాజ‌కీయ స‌న్యాసం చేస్తే జ‌గ‌న్ ఏం చెపుతారో ? చూడాలి.

విశిష్ట సేవలందించారు. తండ్రి మార్గంలోనే పయనిస్తానని బొత్స సందీప్ చెబుతున్నారు. బొత్స యువసేనను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. మరి తండ్రి బొత్స రాజకీయ వారసత్వాన్ని సందీప్ నిలబెడతారా? లేదా? అన్నది రానున్న కాలంలో చూడాలి.