టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే మహేష్ ఈ ఇద్దరిలో ముందు ఏ డైరెక్ట్‌తో సినిమాను పట్టాలెక్కిస్తాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నిన్న మొన్నటి వరకు త్రివిక్రమ్ సినిమానే ముందు చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ, త్రివిక్రమ్ తో చేసి, అది పూర్తయిన తరువాతనే రాజమౌళి ప్రాజెక్టుపైకి వెళ్లాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. అందువల్ల మహేష్ రాజమౌళికి ఓటేశాడని, మొదట ఆయనతోనే మూవీని పట్టాలెక్కిస్తాడని అంటున్నారు.
పైగా రాజమౌళి-మహేష్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రానికి ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయే కథ కూడా సిద్ధం చేసేశారని అంటున్నారు. ఇక `ఆర్ఆర్ఆర్` విడుదలైన తర్వాత మహేష్ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను రాజమౌళి ఇవ్వనున్నారని టాక్. మరి ఇదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోవడం ఖాయం.