బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్‌లు డిసెంబర్ 9న మూడుముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనాల వివాహం కుటుంబసభ్యులు, దగ్గర బంధువులు మరియు బాలీవుడ్ ప్రముఖుల మధ్య అంగ రంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకలకు, ప్రివెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్‌షిప్‌ను అత్యంత సీక్రెట్‌గా ఉంచిన ఈ బ్యూటీఫుల్ జంట వివాహం అనంతరం ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అలాగే పెళ్లి తర్వాత అత్తగారింట్లో కత్రినా తొలిసారి వంట కూడా వండి భర్తకు రుచి చూపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా కత్రినాకు విక్కీ బిగ్ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెళ్లై పది రోజులు గడవకు ముందే కొత్త పెళ్లి కొడుకు విక్కీ షూటింగ్‌కు రెడీ అయ్యాడు. తను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయడానికి సై అంటున్నాడు. ఫ్రెష్‌గా సెల్ఫీ తీసి తన ఇన్‌స్టా లో షేర్ చేశాడు విక్కీ. ముందు టీ.. ఆ తర్వాత షూటింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
దీంతో నెటిజన్లు విక్కీ పోస్ట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ ప్లానింగ్స్ లేకుండానే షూటింగ్‌కు బయలుదేరావా..? ఎందుకు కత్రినాకు ఇలా షాక్ ఇచ్చావు..? అసలు కత్రినా ఎక్కడ..? అంటూ చమత్కరిస్తున్నారు. దీంతో మళ్లీ కత్రినా-విక్కీలు నెట్టంట హాట్ టాపిక్‌గా మారారు.