టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఘోర అవమానం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బన్నీ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నిన్న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల బన్నీ..బెంగుళూరులో నిర్వహించి ప్రెస్‌మీట్ పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ కన్నడ రిపోర్టర్ అల్లు అర్జున్ పై తీవ్రంగా మండిపడ్డాడు. `11:30 కి ప్రెస్ మీట్ అయితే మీరు 1:30 కి హాజరయ్యారు. 2 గంటలు లేట్ గా వచ్చారు. 2 గంటల నుండీ జర్నలిస్ట్ లని కెమెరా మెన్ లని వెయిట్ చేయించడం మీకు ఏమైనా బాగుందా? అసలు మీరు మా మీడియా గురించి ఏమనుకుంటున్నారు?` అంటూ ప్రశ్నించాడు.
దాంతో క్షమాపణలు చెప్పిన బన్నీ.. పొగమంచు కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యం అయ్యిందని, అంతేకాకుండా ప్రెస్‌మీట్ టైమింగ్‌పై తనకు స్పష్టత లేదని చెప్పుకొచ్చాడు. అలాగే సారీ చెబితే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అంటూ బన్నీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే ఈ విడియో చూసి కోపాన్ని తట్టుకోలేకపోయిన బన్నీ ఫ్యాన్స్.. సదరు మీడియా రిపోర్టర్‌పై మండిపడుతున్నారు. కావాలనే తమ హీరోను అవమానించారని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ ఇష్యూ మాత్రం గత రెండు రోజుల్లో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.