`భవదీయుడు భగత్ సింగ్` బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌..!?

November 17, 2021 at 7:48 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం.

Pawan Kalyan picks Pooja Hegde for Bhavadeeyudu Bhagat Singh

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ విష‌యం ఏంటంటే.. వ‌చ్చే ఏడాది ద‌స‌రా బ‌రిలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా దిగ‌బోతోందట‌. అక్టోబర్ 5వ తేదీని ఈ సినిమా రిలీజ్ డేట్‌గా కూడా ఖ‌రారు చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

PSPK 28 first look poster out: Pawan Kalyan teams up with Harish Shankar for new film - Movies News

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, గబ్బర్ సింగ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ప‌వ‌న్‌-హ‌రీష్‌ల‌ కాంబినేషన్ ఈ సారి కూడా సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. మ‌రోవైపు అభిమానులు సైతం ఈ మూవీపై భారీ అంచ‌నాల‌ను పెట్టుకున్నారు. మ‌రి ఆ అంచ‌నాల‌ను ప‌వ‌న్ ఏ మేర‌కు అందుకుంటాడో చూడాలి.

`భవదీయుడు భగత్ సింగ్` బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts