నిర్మాతలను ఆదుకుంటున్న నాచురల్ స్టార్ నాని..

కరోనా ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో.. ఏపీ, తెలంగాణలో థియేటర్లు మూత పడడం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలోనే థియేటర్ లు ఓపెన్ చేసుకోవచ్చని రాష్ట్ర సంస్థలు తెలిపాయి. అయితే ఏపీలో టికెట్ల రేట్లు మాత్రం మరింత తక్కువగా ఉండడంతో థియేటర్లో తెరవడానికి ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.

అయితే నాని గతంలో వి సినిమాని ఓటీటీలో విడుదల చేయగా, సినిమా ఫ్లాప్ టాక్ తో నిలిచింది. ఇక ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయడం గమనార్హం. ఈ సినిమాని ఏకంగా రూ.37 కోట్లు రూపాయలకు అమెజాన్ సంస్థ హక్కులను సంపాదించుకున్న ట్లు సమాచారం.

ఇక ఈ సినిమా వల్ల బయ్యర్లు కష్టపడి పోకుండా ఉండేందుకు, నిర్మాతలపై భారం పడకుండా ఉండేందుకు, థియేట్రికల్ రిలీజ్ విషయంలో అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకోవడం.. ఈ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల నిర్మాతలకు చాలా నష్టపోతారని ఉద్దేశంతోనే.. నాని నిర్మాతలకు వీలైనంత సహాయం చేస్తానని చెప్పారట.

ఇక ఓటీటీలో విడుదల చేయడానికి నాని కూడా ఓకే అని చెప్పడంతో, నిర్మాతలు ఎంతో సంతోషిస్తున్నారు. అంతేకాకుండా సినిమా విడుదలైన తర్వాత తను తీసుకున్న డబ్బును..తానే స్వయంగా తిరిగి ఇస్తాడు అని చెప్పడంతో.. నాని గొప్ప మనసున్న వ్యక్తి అని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు అమెజాన్ లో వస్తుందని , ఈ సినిమా కోసం మనం వేచిచూడాల్సి ఉంది.

ఇలాంటివి చేయడం వల్ల స్టార్ హీరోలతో సినిమాలలో నటించడానికి మరికొంతమంది ముందుకు వస్తారు అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలు.