జ‌క్క‌న్న‌తో చిల్ అవుతున్న చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్‌..వీడియో వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్‌ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ జాయిన్ అయ్యారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ వీడియోలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ న‌వ్వుకుంటుండ‌గా.. దీనిని రాజ‌మౌళి డ‌మ్మీ కెమెరాతో షూట్ చేయ‌డం, చివరికి చరణ్‌ కట్‌ చెప్పడం ఆకట్టుకుంటుంది.

షూటింగ్ నుంచి గ్యాప్ దొర‌క‌డంతో ఆర్ఆర్ఆర్ హీరోలు జ‌క్క‌న్న‌తో చిల్ అవుతున్నార‌ని తాజాగా వ‌దిలిన వీడియో ద్వారా స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. కాగా, షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క‌నిపించ‌నున్నాడు.

https://twitter.com/RRRMovie/status/1423983359252865030?s=20