ఏపీ ప్రభుత్వం పై ఇన్ని కేసులు పెట్టడం వెనుక కారణం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై రోజురోజుకి వ్యతిరేకత మారుతూనే ఉన్నది.ఇక జగన్ మోహన్ రెడ్డి చేసేటటువంటి కొన్ని పనులు నచ్చక ప్రజలు, ఏపీలో ఉండేటువంటి మంత్రులు,యువత నిరుత్సాహం తో ఉన్నట్లు సమాచారం.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పై భారీ సంఖ్యలో కేసులను నమోదు చేశారట వాటి వివరాలను చూద్దాం.

ఏపీ ప్రభుత్వంపై ప్రతిరోజు కేసులు భారీగానే పెరుగుతున్నాయి.పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇతర కారణాల వల్ల, ఇప్పటివరకు దాదాపుగా లక్షా తొంభై నాలుగు వేల పిటిషన్లు దాఖలయ్యాయి అన్నట్లు సమాచారం.ఇలా కేసులు వేయడం వెనుక ఎంతటి కారణం ఉంది, అనే విషయం ఇంకా తేలలేదు.

ఇక ఇందులో కోర్టు ధిక్కరణ కేసు లు 8000 ఉన్నట్లు అంచనా. ఒకరోజు సగటున 450 మంది కొత్త పిటిషన్లను నమోదు చేస్తున్నారట.ఇక దీంతో విచారణకు హాజరు కావడం అధికారులకు పెనుభారంగా మారినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల అధికారులపై తీవ్ర ఒత్తిడి గురవుతున్నట్లు అధికారులు ఆవేదన చెందుతున్నారు. ఈ కేసులన్నీ కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినవా, లేదా మరి ఎవరైనా కావాలని చేస్తున్నారు అనే విషయం ఇంకా తేలలేదు.