కాట‌మ‌రాయుడు స‌రికొత్త వ్యూహం

త‌న ఇమేజ్‌ను పెంచేలా, త‌న వ్య‌క్తిత్వానికి ద‌గ్గ‌ర‌గా ఉంటే డైలాగులు ప‌వ‌న్ సినిమాల్లో చాలా వినిపిస్తుంటాయి. `నేనొచ్చాక రూల్ మారాలి.. రూలింగ్ మారాలి.. టైమ్ మారాలి.. టైమింగ్ మారాలి అని` చెప్పినా.. `ఒక్క‌డినే.. ఎంత‌దూరం వెళ్లాల‌న్నా ముంద‌డుగు ఒక్క‌టే!! ఎక్క‌డిక‌యినా ఇలానే వ‌స్తా.. ఇలాగే ఉంటా.. జ‌నంలో ఉంటా.. జ‌నంలా ఉంటా`.. అంటూ స‌ర్దార్‌లో ఆవేశంగా చెప్పినా.. ఇవ‌న్నీ ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్‌ను ప్ర‌భావితం చేసేవే! ఇప్పుడు దీనిని `కాట‌మ‌రాయుడు` టైటిల్ సాంగ్ కూడా దీనిని మ‌రో స్టేజ్‌కి తీసుకెళ్లింది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఏది చేసినా అందులో ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి మెడ‌లో ఎర్ర కండువా, పోలీస్ డ్రెస్సులోనే క‌నిపించిన ప‌వ‌న్‌.. ఇప్పుడు `కాట‌మ‌రాయుడి`కి అదే రూల్ ఫాలో అవుతున్నాడు. అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసేందుకు స‌రికొత్త వ్యూహం అనుస‌రిస్తున్నాడు. ఇటీవ‌లే కాట‌మ‌రాయుడు టైటిల్ సాంగ్ విడుద‌లైంది. ఇందులో ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా `మిరా మిరా మీసం అనే గీతాన్ని తొలి పాట‌గా విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ప్ర‌స్తుతం ఈ పాట జ‌న‌సేన అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది,

`నాయకుడై నడిపించేవాడు… సేవకుడై నడుం వంచే వాడు… అందరికోసం అడుగేశాడు.. కాటమరాయుడు.. ` అంటూ సాగే లిరిక్స్‌తో ఇప్పుడు కాట‌మ‌రాయుడు ముందుకొచ్చాడు. రెపరెపరెప లాడే జెండాల పొగరున్నోడు. తల వంచక నిన్నంచుల పైనే వుంటాడు…. ఇలా సాగే చ‌ర‌ణాలు ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులకు కిక్కెస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్న కాట‌మ‌రాయుడు రిలీజ్‌కి ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఈ లోగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్ల‌ని ముమ్మ‌రం చేసింది. అందులో భాగంగా కాట‌మ‌రాయుడు టైటిల్ సాంగ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

రామ‌జోగ‌య్య శాస్త్రి ప‌వ‌ర్ ఫుల్ లిరిక్స్… ఈ పాటు వ‌న్నె తెచ్చాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌.. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నాడు. దీంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సినిమాలు కూడా ఒక మార్గంగా ఎంచుకున్నాడు. దీంతో అత‌డి పొలిటిక‌ల్ ఇమేజ్‌ని పెంచుకోవ‌డాకి ఇలాంటి పాట త‌యారు చేశారా..?? అనే అనుమానాలూ వ‌స్తున్నాయి. సాధార‌ణంగా ఇలాంటి హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌ల్లో హీరోను పొగుడుతూ ఉంటుంది. కానీ కాట‌మ‌రాయుడు పాట వింటే.. రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ప్ర‌చారానికి వాడుకోవ‌డానికి అనువుగా ఉంద‌నేది ఇప్ప‌టికే అర్థ‌మైపోయింది. మ‌రి ప‌వ‌న్ ఎక్క‌డా తగ్గేలా క‌నిపించ‌డం లేదు.