బాల‌య్య‌కు కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్‌

అదేంటి? ఏపీ ఎమ్మెల్యేకి తెలంగాణ సీఎం కేసీఆర్ గిఫ్ట్ ఎలా ఇస్తార‌ని అనుకుంటున్నారా? అదే ట్విస్ట్‌! బాల‌య్య ప్ర‌తిష్టాత్మంగా భావిస్తున్న 100 వ సినిమా శాత‌క‌ర్ణి.. వ‌చ్చే సంక్రాంతికి రెండు రాష్ట్రాల్లోనూ విడుద‌ల‌కు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శాత‌వాహ‌నుల కాలంగాని గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి స్టోరీని సెల్యులాయిడ్‌పై అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నాడు క్రిష్‌.  గౌత‌మీ పుత్ర పాత్రలో బాల‌య్య గెట‌ప్ కూడా అదిరిపోతోంది. చారిత్రక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ సంచ‌ల‌నం సృష్టించ‌నుంద‌నేని ఫిలింన‌గ‌ర్ టాక్‌.

ఇక, ఈ మూవీకి టాక్స్ బెనిఫిట్ పొందాల‌ని మూవీ యూనిట్ భావిస్తోంది. దీనికి నేరుగా హీరో బాల‌య్య‌నే రంగంలోకి దిగారు. ఈ మూవీ స్టోరీ ఎలాగూ ఆంధ్రా మూలాలు ఉన్న‌దే కాబ‌ట్టి ఏపీ సీఎం చంద్ర‌బాబు లైక్ చేస్తారు. సో.. ఏపీలో ప‌న్ను మిన‌హాయింపు క‌ష్టం కాక‌పోవ‌చ్చు. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డి హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం వంటి ప్ర‌ధాన సెంట‌ర్లు.. ఈ మూవీకి ప్ల‌స్ పాయింట్లు కానున్నాయి. దీంతో .. ఈ స్టేట్‌లోనూ మూవీకి ప‌న్ను మిన‌హాయింపు పొందితే కొంత లాభం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

వాస్త‌వానికి ఏపీ వ్య‌క్తుల‌న్నా, ఏపీ నేత‌ల‌న్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి అంత‌గా ఇష్టం ఉండ‌రు. అయితే, ఆయ‌న‌కు హిస్టారిక‌ల్‌గా మాత్రం నేత‌లంటే చాలా ఇష్టం. ఈ క్ర‌మంలోనే గుణ‌శేఖ‌ర్ నిర్మించిన రుద్ర‌మ‌దేవి మూవీకి ఆయ‌న అడిగిన త‌డ‌వుగా ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే  ఇప్పుడు గౌత‌మీ పుత్ర‌కి కూడా ప‌న్ను మిన‌హాయింపు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే  సినిమా విడుదలకు ముందు ముఖ్యమంత్రికి, ఆయన మంత్రి వర్గ సహచరులకు స్పెషల్ గా స్క్రీనింగ్ వేసి, పన్ను మినహాయింపు కోరాలని శాతకర్ణి యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సో.. బాల‌య్య కోరిక మేర‌కు కేసీఆర్ ఈ మూవీకి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప‌న్ను మిన‌హాయించే అవ‌కాశం ఉంది.  ఫ‌లితంగా ప్ర‌స్తుత‌మున్న లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి  మూవీ క‌లెక్ట్ చేసే మొత్తం రెవెన్యూలో 15 % చెల్లించాల్సిన టాక్స్ ల‌బ్ధి పొంద‌నున్నారు.