సాగ‌ర్ నాల్గవ రౌండ్ లో ఎవరు టాప్ అంటే..?

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ దూసుకుపోతున్నారు. వ‌రుస‌గా తొలి నాలుగు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. నాలుగో రౌండ్ ముగిసే స‌రికి 3,457 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, […]

కేసీఆర్‌పై ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఒక్క‌సారిగా మంత్రి ఈటల రాజేందర్ హాట్ టాపిక్‌గా మారారు. దీంతో కేసీఆర్‌తో దీర్ఘకాలంగా ఉన్న అనుబంధం ఒక్కసారిగా తెగిపోయింది. పైకి గంభీరంగా క‌నిపిస్తున్నా అనూహ్య పరిణామాలతో ఆయన దిక్కుతోచని స్థితికి గురయ్యారు. షామీర్‌పేట ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన మంత్రి ఈటల రాజేందర్ ఒక ప‌త్రిక‌తో త‌న మ‌నోభావాలను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేద‌ని, కానీ వంద శాతం […]

ఈట‌ల‌కు బీజేపీ అమిత్‌షా ఫోన్‌..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన‌ మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపుల‌కు తెర‌లేపారు. శ‌నివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్‌పేట్‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మైన ఈట‌ల అక్క‌డ త‌న నియోజకవర్గ అభిమానులతో స‌మావేశ‌మ‌య్యారు. ఇదిలా ఉండ‌గా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు స‌మాచారం. […]

మంత్రి ఈటల భూ ఆక్రమణల వివాదంలో కీలక మార్పు.. ?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూముల పై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజకీయం పై అలజడి రేపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలుఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నేడు మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల […]

కేసీఆర్‌కు మ‌రోసారి క‌రోనా టెస్ట్‌లు..ఏం తేలిందంటే?

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా సామాన్య ప్రజల‌పై మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులుపై కూడా పంజా విసురుతోంది. ఇటీవ‌లె తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స […]

దేశ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వైర‌స్ సుడిగాలిలా చుట్టేస్తున్న‌ది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాట‌గా, కొత్తగా.. 1,005 కరోనా […]

పుర‌పోరుపై తెలంగాణ ఎస్ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

క‌రోనా వైరస్‌ పంజా విసురుతోంది. విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. సుడిగాలిలా వ్యాపిస్తూ వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. దీంతో అడుగు బ‌య‌ట‌పెట్టాలంటేనే జ‌నం జంకుతున్న‌ది. ఈ మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం సైతం వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల‌ను షెడ్యూల్ ప్ర‌కారం యథాతధంగా నిర్వ‌హించ‌నున్న ప్ర‌క‌టించ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నెల 30న […]

మ‌హ‌బూబాబాద్ ఎంపీ‌కు క‌రోనా పాజిటివ్..!?

తెలంగాణ కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మ‌హ‌బూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు క‌విత‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. డాక్టర్స్ సలహా మేర‌కు ఆమె హైద‌రాబాద్‌లో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు క‌విత తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని ఎంపీ కవిత సూచించారు. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, […]

కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివ‌ర్గంలోకి క‌విత‌‌..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్ఎస్ మొదటి నుంచీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. దీంతో మొత్తం స్థానిక సంస్థలకు చెందిన ఓటర్లు 824 మంది ఉన్నారు. అయితే ఇందులో 821 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాటిలో టీఆర్ఎస్ […]