కెసిఆర్ ఆకర్ష్ మజ్లీస్ ను తాకేనా!!

టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేస్తోంటే, కాంగ్రెస్‌ పార్టీ సంబరపడింది. కాంగ్రెస్‌ ఖాళీ అవుతోంటే టీడీపీ సంబరపడ్తోంది. ఇదంతా చూసి, బీజేపీ తమకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది. మజ్లిస్‌ పార్టీ అయితే అసలు తాము తెలంగాణలోనే వున్నామా.? తెలంగాణ రాజకీయాలతో మమేకమయి వున్నామా? లేదా.? అన్నట్లే వుంటోంది. నిన్న టీడీపీ..ఆ తర్వాత వైెస్సార్సీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపు ఇంకో పార్టీ. ఆ ఇంకో పార్టీ బీజేపీ కావొచ్చు, మజ్లిస్‌ పార్టీ కావొచ్చు. ఒక్కసారి ఆపరేషన్‌ ఆకర్ష స్టార్ట్‌ అయ్యిందంటే, […]

జానారెడ్డి దిమ్మతిరిగే స్కెచ్!!

జానారెడ్డి ఉన్నట్టుండి… పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ… సీఎల్పీ కి రిజైన్ చేస్తానడడం వెనుక పెద్ద స్టోరీయే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతొ టిడిపి, కాంగ్రెస్ నాయకులను తనలో కలిపేసుకుంది. ఇక ఇప్పుడు గులాబీ గురి జానారెడ్డి పై నే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో రాలేనని చెప్పిన జానా… తన కొడుకు విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గులాబీ […]

తెలంగాణా లో మిగిలింది ఒకే ఒక్కడు!!

తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్‌రెడ్డి, టిడిపి నుంచి మల్లారెడ్డి, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయం సాధించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసి విజయం సాధించారు. అనంతరం టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్ […]

కోదండరాం ని కెలకొద్దు – కెసిఆర్

తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను విమర్శించవద్దని మంత్రులు, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు చేస్తే దాన్ని విపక్షాలు అనుకూలంగా మరల్చుకునే అవకాశముందనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని గ్రహించిన కెసిఆర్ నష్ట నివారణకి పూనుకున్నాడు. రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టి.సర్కార్ తీరుపై కోదండరాం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆపై కోదండరాంను తప్పబడుతూ మొత్తం […]

పాపం ఈ జంపింగ్ లు అభివృద్ధి కోసమేనట..హవ్వ..

నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాన్కర్ రావు, రవీంద్రనాయక్ తాము అధికార‌ టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్న‌ట్లు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వాములం కావాల‌నే టీఆర్ఎస్‌లో చేరుతున్నామని సెలవిచ్చారు. తాము ఎల్లుండి సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను వీడుతుండ‌డం తమకు బాధ క‌లిగిస్తోంద‌ని అన్నారు. కాంగ్రెస్‌లోని అంతఃక‌ల‌హాల‌తో తాము మ‌నో వేద‌న‌కు గుర‌య్యామ‌ని […]

కోదండరామ్ పై గులాబీ దండయాత్ర

తెలంగాణ సర్కార్ తీరే వేరు. తమ వైఖరిని ప్రతిపక్షాలు ఎండగట్టినా పట్టించుకోదు. పైగా విపక్షనేతలపై తనదైన తరహాలో విరుచుకుపడుతుంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తుతుంది. ఇలాంటి అధికార పార్టీ కోదండరామ్ తమను విమర్శించగానే అగ్గి మీద గుగ్గిలమైంది. అధిష్టాన పెద్దలతో పాటూ చిన్నాచితకా నేతలూ ఆయనపై ఫైర్ అయిపోతున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడి ఎన్నికలు రాగానే ఫక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని ప్రకటించుకుంది. టీఆర్ఎస్ లక్ష్యం స్వరాష్ట్రాన్ని సాధించడమే […]