కాపుల ఉద్యమానికి ఇక KCR ఆయుధం!!

తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ ముక్యంగా KCR వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి […]

కెసియార్‌ వెన్నులో వణుకు పుట్టింది

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసియార్‌) భయపడలేదు. అంతెందుకు, కోదండరామ్‌ తమ ప్రభుత్వాన్ని కుదిపేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కెసియార్‌ని ఒకటి భయపెట్టింది. అలా ఇలా కాదు, వెన్నులో వణుకుపుట్టేలా చేసింది. అదే పోలియో వైరస్‌. హైద్రాబాద్‌లోని ఓ మురికి కాలువ నీటి శాంపిల్స్‌ని పరీక్షిస్తే అందులో పోలియో వైరస్‌ వెలుగు చూడటంతో కెసియార్‌ షాక్‌కి గురయ్యారు. దేశం నుంచి పోలియో […]

తెలంగాణా లో మిగిలింది ఒకే ఒక్కడు!!

తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్‌రెడ్డి, టిడిపి నుంచి మల్లారెడ్డి, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయం సాధించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసి విజయం సాధించారు. అనంతరం టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్ […]

బావ.. బామ్మర్ది..ఓ తెలంగాణా..

ఆ మధ్యన AP CM చంద్రబాబు నాయుడు గారు అసలు తెలంగాణా ప్రజానీకానికి పొద్దున్నే లేవడం NTR గారే నేర్పించారని మాట జారి తరువాత నాలుక కరుచుకోవడం ఆయన వంతైంది.అక్కడికేదో తెలంగాణా వాళ్ళు బద్దకస్తులని వారికి రామారావు గారే పొద్దున్న లేవటం నేర్పారన్నట్టు సెలవివ్వడంతో క్షమాపణ చెప్పే వరకు వెళ్ళింది వ్యవహారం.ఈయనకి ఈ తరహా చలోక్తులు ఈ మధ్యన బాగానే రివర్స్ అవుతున్నాయి.కోడలు మగబిడ్డని కంటా అంటే అత్త వద్దంటుందా అని,వెనుకబడిన కులాల్లో పుట్టాలని ఎవరినా కోరుకుంటారా […]

కోదండరాం ని కెలకొద్దు – కెసిఆర్

తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను విమర్శించవద్దని మంత్రులు, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు చేస్తే దాన్ని విపక్షాలు అనుకూలంగా మరల్చుకునే అవకాశముందనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని గ్రహించిన కెసిఆర్ నష్ట నివారణకి పూనుకున్నాడు. రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టి.సర్కార్ తీరుపై కోదండరాం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆపై కోదండరాంను తప్పబడుతూ మొత్తం […]

ఇది ఆంధ్ర కాదు అమిత్ జీ..లెక్క పక్క ఉండాలే!!

తెలంగాణను బీజేపీ ఆదుకోలేదని తెలంగాణ నుంచి పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దోచుకుని, తమ మిత్రపక్షం కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభకు హాజరైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, తెలంగాణకు 90 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఇచ్చిందనీ అయినా తెలంగాణ […]

కొత్త జిల్లాలు – ఇవి చాలా కాస్ట్లీ గురూ

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంవల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2వేల కోట్ల వరకు భారం పడనున్నట్టు ప్రాథమిక అంచనాలో తేలినట్టు తెలిసింది.ఎందుకా అంత అనుకుంటున్నారా! ఏర్పాటు కాబోయే 14-15 కోత్హ జిల్లాలకు భవనాల నిర్మాణానికే జిల్లాకు రూ. 100 కోట్ల. ఈ లెక్క ప్రకారమే దాదాపురూ. 14 నుంచి 15 వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనికి తోడు భవనాల నిర్మాణం కోసం ఖర్చు చేసే నిధులతోపాటు వాహనాలు, ఫర్నిచర్, సామగ్రి, భవనాల […]

మేస్టారు వీక్‌ కాదు, యమ స్ట్రాంగ్‌

పిల్లలకు పాఠాలు చెప్పుకునే మేస్టారు, రాజకీయంగా తాను కొట్టే దెబ్బను తట్టుకోలేరులే అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విషయంలో అనుకుని, భంగపడినట్లున్నారు. కెసియార్‌ కారణంగానే కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా కనిపించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి. అక్కడికి కోదండరామ్‌ చాలా సంయమనం పాటించారు. రెండేళ్ళు వేచి చూసి, తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు తీరతాయనీ, […]

కోదండరామ్ పై గులాబీ దండయాత్ర

తెలంగాణ సర్కార్ తీరే వేరు. తమ వైఖరిని ప్రతిపక్షాలు ఎండగట్టినా పట్టించుకోదు. పైగా విపక్షనేతలపై తనదైన తరహాలో విరుచుకుపడుతుంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తుతుంది. ఇలాంటి అధికార పార్టీ కోదండరామ్ తమను విమర్శించగానే అగ్గి మీద గుగ్గిలమైంది. అధిష్టాన పెద్దలతో పాటూ చిన్నాచితకా నేతలూ ఆయనపై ఫైర్ అయిపోతున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడి ఎన్నికలు రాగానే ఫక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని ప్రకటించుకుంది. టీఆర్ఎస్ లక్ష్యం స్వరాష్ట్రాన్ని సాధించడమే […]