మారనున్న సిఎం క్యాంపు కార్యాలయం

దసరా నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్త క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాలశాఖ కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవన నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతమున్న ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్ స్థలంలో ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం, నివాస భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మార్చిలోనే ఈ పనులను ప్రారంభించారు. మరోవైపు సీఎం కొత్త భవనంలోకి మారాక ప్రస్తుత నివాసాన్ని కూలుస్తారా లేదా ఇతర అధికారిక అవసరాలకు వినియోగిస్తారా […]

కాంగ్రెస్ ఖేల్ ఖతం-ఇది కెసియార్‌ జమానా!!

తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖతం చెయ్యాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసియార్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. డి.శ్రీనివాస్‌ని టిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి, ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడం వెనుక వ్యూహం ఇదే. అంతకు ముందే కేశవరావుని కూడా కెసియార్‌, టిఆర్‌ఎస్‌లోకి తీసుకురాగలిగారు. కేశవరావు, డిఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎంతో కీలక నేతలుగా ఉండేవారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేత వెంకటస్వామిని కూడా తీసుకురావాలనుకున్నారుగానీ, కుదరలేదు. ఆయన కుమారులిప్పుడు టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అతి త్వరలో ఇంకో కాంగ్రెసు ముఖ్య నేత […]

విజయశాంతితో ‘ఒసేయ్‌ రాములమ్మ’ సీక్వెల్‌

అప్పట్లో విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఒసేయ్‌ రాములమ్మ’ సినిమా సెన్సేషన్‌ సృష్టించింది. తెలంగాణా ఉద్యమకారిణిలా విజయశాంతి తన నటనతో దుమ్ము రేపింది. దాసరి దర్శకత్వం చేస్తూ, నటించిన సినిమా ఇది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్‌ చేశారు ఇండస్ట్రీలో. ఎందుకంటే దాసరి నారాయణరావు, విజయశాంతితో ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఎప్పట్నుంచో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కించాలనుకుంటున్నారు దాసరి. వేరే హీరోయిన్‌ని పెట్టి కూడా ఈ సినిమాను తీయాలనుకున్నారు. కానీ […]

తెరాస ని డీ కొట్టే సత్తా డీకే అరుణకుందా!!

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుండి కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిద్యం వహిస్తూ కాంగ్రెస్ లో మహా మహా రాజకీయ కురువ్రుద్దులకే కెసిఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక తెరాస కి దాసోహం అవుతుంటే ఒక్క డీకే అరుణ మాత్రం కెసిఆర్ అండ్ తెరాస పార్టీ పై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటు అసెంబ్లీ లో ఇటు బయట తెరాస వైఫల్యాల్ని ఎండగడుతూ శభాష్ అనిపించుకుంటోంది.ఇక తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటన […]

చంద్రబాబు నాన్చుడు-కెసిఆర్ దూకుడు..

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ దూకుడుగా వెళుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, పార్టీ ఫిరాయించిన నేతలకు పదవులు కూడా కట్టబెడుతున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అలాగే మంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశావహుల్ని వెయిటింగ్‌లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబుని కవ్వించడానికి కెసియార్‌ ఇంకోసారి పదవుల పందేరం స్టార్ట్‌ చెయ్యనున్నారని సమాచారమ్‌. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కెసియార్‌ భావిస్తున్నారట. అలాగే మాజీ ఎంపీ వివేక్‌కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని గుసగుసలు […]

కెసిఆర్ ఆకర్ష్ మజ్లీస్ ను తాకేనా!!

టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేస్తోంటే, కాంగ్రెస్‌ పార్టీ సంబరపడింది. కాంగ్రెస్‌ ఖాళీ అవుతోంటే టీడీపీ సంబరపడ్తోంది. ఇదంతా చూసి, బీజేపీ తమకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది. మజ్లిస్‌ పార్టీ అయితే అసలు తాము తెలంగాణలోనే వున్నామా.? తెలంగాణ రాజకీయాలతో మమేకమయి వున్నామా? లేదా.? అన్నట్లే వుంటోంది. నిన్న టీడీపీ..ఆ తర్వాత వైెస్సార్సీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపు ఇంకో పార్టీ. ఆ ఇంకో పార్టీ బీజేపీ కావొచ్చు, మజ్లిస్‌ పార్టీ కావొచ్చు. ఒక్కసారి ఆపరేషన్‌ ఆకర్ష స్టార్ట్‌ అయ్యిందంటే, […]

జాక్ పాట్ కొట్టనున్న వివేక్..

రాజు తలచు కుంటే దెబ్బలకి కరువా అన్నట్టుంది తెలంగాణా రాజకీయ సిత్రం.కెసిఆర్ కరుణ వుంటే చాలు రాత్రికి రాత్రి ఏ జాక్ పాట్ అయినా తగలోచ్చు.ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చి చేరి.. తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిపోయి.. ఎన్నికలను ఆ పార్టీ నుంచే ఎదుర్కొని తిరిగి ఇప్పుడు టీఆర్ ఎస్ లోకి వచ్చి చేరిన కాకా తనయుడు వివేక్ కు ఇప్పుడు జాక్ పాట్ తగలనుందని టిఆర్ ఎస్ లో టాక్. ప్రస్తుతానికి మాజీ […]

జానారెడ్డి దిమ్మతిరిగే స్కెచ్!!

జానారెడ్డి ఉన్నట్టుండి… పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ… సీఎల్పీ కి రిజైన్ చేస్తానడడం వెనుక పెద్ద స్టోరీయే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతొ టిడిపి, కాంగ్రెస్ నాయకులను తనలో కలిపేసుకుంది. ఇక ఇప్పుడు గులాబీ గురి జానారెడ్డి పై నే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో రాలేనని చెప్పిన జానా… తన కొడుకు విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గులాబీ […]

తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతోందా?

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జువ్వాడ నర్సింగరావులను సీఎం తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటూ భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి […]