కుడి, ఎడ‌మైన నారాయ‌ణ‌, గంటా ప్లేస్‌లు

ఏపీలో చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు, నారాయ‌ణ ఇద్ద‌రూ స్వ‌యాన వియ్యంకులే. గ‌త ఎన్నిక‌ల్లో గంటా పార్టీ మారి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం గంటాకు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. నారాయ‌ణ‌కు మాత్రం చాలా ల‌క్‌గా కేబినెట్‌లో బెర్త్ ద‌క్కింది. ఆయ‌న‌కు అప్ప‌టి వ‌ర‌కు ఎన్నికలంటే ఏంటో కూడా తెలియ‌దు. విద్యాసంస్థ‌ల అధినేత‌గా ఉన్న నారాయ‌ణ ఒక్క‌సారిగా మంత్రి అయిపోయారు. నారాయ‌ణ మంత్రి అవ్వడం ఆల‌స్యం…చంద్ర‌బాబుకు […]

నారాయ‌ణ‌.. ఆనంపై ఈ చిన్న చూపేలా!!

పూల‌మ్మిన చోటే.. క‌ట్టెల‌మ్మ‌డం ఈ మాట రాజ‌కీయాల్లో త‌ర‌చూ వినిపిస్తుంది. పార్టీ అధికారంలో ఒక వెలుగు వెలిగి.. త‌మ మాటే శాస‌నంగా ఉన్న నాయ‌కులు.. ప‌వ‌ర్ పోగానే ఒక్క‌సారిగా చీక‌ట్లోకి వెళిపోతారు! త‌మకు కావాల్సిన ప‌నుల‌ను చిటికెలో చేయించుక‌న్న చోటే.. త‌మ ప‌ని అవ్వ‌డానికి ఎంతో కాలం వేచిచూడాల్సిన ప‌రిస్థితి! ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి సంఘ‌ట‌నలే జ‌రుగుతున్నాయి. ఆనం వివేకానంద‌రెడ్డికి, మంత్రి నారాయ‌ణ‌కు మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌.. అచ్చు సినిమాలోని సన్నివేశాన్ని త‌ల‌పించేలా […]

లోకేష్‌ కోసం ఆయ‌న త్యాగం చేయాల్సిందేనా..!

ఎవ‌రు.. ఆ ఒక్క‌రు ఎవ‌రు? చిన‌బాబు కోసం మంత్రి ప‌ద‌వి త్యాగం చేసేవారు ఎవ‌రు? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీచేస్తే.. రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు. కానీ ఎమ్మెల్సీగా పోటీచేయ‌డంతో చిక్కు వ‌చ్చిపడింది. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గం నుంచి ఉద్వాస‌న ప‌లికే వారి స్థానంలో కొత్త వారి పేర్లు దాదాపు ఖ‌రార‌య్యాయి. ఇక ఎవ‌రో ఒక‌రిని ప్ర‌త్యేకంగా తొల‌గించి త‌న త‌న‌యుడికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి వ‌స్తుంది. అందుకే […]

ఏపీలో తెలుగు భాష పీక నొక్కుతున్న మంత్రి

దేశ భాష‌లందు తెలుగు లెస్స‌! అన్న కృష్ణ‌దేవ‌రాయులు.. తెలుగు రాష్ట్ర‌మైన ఏపీలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని చూసి ముక్కున వేలేసుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాష్ట్రానికి అనాదిగా ఉన్న భాషా ప్ర‌యుక్త రాష్ట్ర‌మ‌నే పేరును చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తుడిచి పెట్టేయాల‌ని చూస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే తెలుగు భాష ప్ర‌పంచ వ్యాప్తంగా క‌నుమ‌రుగ‌వుతున్న భాష‌ల్లో ఒక‌టిగా ఉంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసింది. అలాంటి స‌మ‌యంలో మ‌రింత‌గా తెలుగును పోషించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వం దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. […]

సోమిరెడ్డి విషయంలో విలన్స్ వీరేనా?

ఏపీ అధికార పార్టీ టీడీపీలో వింత వైఖ‌రి క‌నిపిస్తోంది! ఏ పార్టీ అయినా.. త‌మకు చెందిన సీనియ‌ర్ నేత‌పై విప‌క్షాలు దాడి చేయ‌డం మొదలు పెడితే.. అంతేస్థాయిలో విరుచుకుప‌డ‌డం సాధార‌ణం. కానీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న ట్రండ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వైకాపా నేత‌లు వ‌రుస పెట్టి.. టీడీపీ సీనియ‌ర్ నేత‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. తెలుగు దేశం పార్టీ నేత‌లు మాత్రం మాట మాత్రం కూడా మాట్లాడ‌క‌పోవ‌డం అంద‌రినీ విస్తుగొలిపిస్తోంది. ముఖ్యంగా అధికార […]

ఆ మంత్రికి – లోకేష్‌కు భారీ గ్యాప్‌

ఏపీ మంత్రుల్లో కొంద‌రి అవినీతి, బంధుప్రీతి వంటివి తార స్థాయికి చేరాయ‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావుపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్న‌టికి మొన్న విశాఖ అవ‌స‌రాల‌కు స్థ‌లాలు కేటాయించేందుకు స‌సేమిరా అన్న అధికారులు మంత్రి గంటా ఒత్తిడితో ఫిలింన‌గ‌ర్ సొసైటీకి విశాఖ‌లో స్థ‌లాలు కేటాయించారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. కేవ‌లం త‌న కుమారుడి టాలీవుడ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా గంటా ఇలా చేశార‌ని టాక్ వ‌చ్చింది. […]

సొంత ప‌త్రిక పెట్టనున్న టీడీపీ

ఎన్ని ప్ర‌సార మాధ్య‌మాలు ఉన్న‌ప్ప‌టికీ.. దిన‌ప‌త్రిక‌లకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అస‌లు ఓ పేదేళ్ల కింద‌ట ఎల‌క్ట్రానిక్ మీడియా అడుగులు వేస్తున్న క్ర‌మంలో ఇంక దిన‌ప‌త్రిక ప‌ని అయిపోయింది! అనే టాక్ వ‌చ్చింది. అయితే, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌న్నా బ‌లంగా దిన‌ప‌త్రిక‌లే నేటికీ త‌మ ఉనికిని చాటుతున్నాయి. మీడియాపై ఒకింత తేలిగ్గా విమ‌ర్శ‌లు చేసే వాళ్లు కూడా ప‌త్రిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌రికి ఆచితూచి మాట్లాడ‌తారు. ప్ర‌జ‌లు కూడా ఎక్కువ‌గా పేప‌ర్ల‌నే న‌మ్ముతారు. అందుకే ఎల‌క్ట్రానిక్ […]

ఆస్తుల్లో ఏపీ మంత్రులే టాప్

ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్ 251 కోట్లతో రెండో […]

చంద్రబాబు చైనా రెండోస్సారి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 26న చైనాకి బయలుదేరుతున్నారు. ఆయనతోబాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏడుగురు ఉన్నతాధికారులు, ఇతరులు ముగ్గురు చైనా వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు సాగే వారి పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, రాజధాని నిర్మాణం కోసం చైనా సంస్థల సహాయ సహకారాలను పొందడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలియజేసింది. అదేంటి ఇదంతా ఇంతకు ముందే విన్నట్టుందా.అయితే మీరు విన్నదీ ,వింటున్నదీ నిజమే నండీ. గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు […]