బ‌న్నీపై తెలుగు మీడియా ఫైర్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇటీవ‌ల ఏ రేంజ్‌లో క్రేజ్ పెరుగుతుందో అదే రేంజ్‌లో కాంట్ర‌వ‌ర్సీల‌తో వార్త‌ల్లో ఉంటున్నాడు. గ‌తేడాది స‌రైనోడు ప్రి – రిలీజ్ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్ అన‌డంతో బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో టార్గెట్ అయ్యాడు. ఆ త‌ర్వాత కూడా బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డంతో డీజే టీజ‌ర్ భార‌త్‌లోనే ఎక్కువ డిజ్‌లైక్‌లు వ‌చ్చిన అత్యంత చెత్త టీజ‌ర్‌గా రికార్డు క్రియేట్ […]

ప‌వ‌న్ పొలిటిక‌ల్ సినిమాకు ఆ మీడియాధినేత డైరెక్ష‌న్‌

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ ట్రెండ్. ప‌వ‌న్ రాజ‌కీయంగా 2019 ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాడు ? అన్న అంశం ప‌క్క‌న పెడితే మ‌నోడు అటు అధికార టీడీపీ, ఇటు విప‌క్ష వైసీపీలలో ఎవ‌రికి దెబ్బేస్తాడు ? అన్న‌ది మాత్రం కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది. ప‌వ‌న్ గెలుస్తాడ‌ని గ్యారెంటీగా చెప్పేవాళ్లు లేక‌పోవ‌చ్చు. కానీ ప‌వ‌న్ దెబ్బ ఈ రెండు పార్టీల‌లో ఎవ‌రో ఒక‌రి గూబ‌గుయ్‌మ‌నిపిస్తుంద‌నేది మాత్రం గ్యారెంటీ అంటున్నారు. ప‌వ‌న్ ఏపీలో గెలిచే సీట్ల […]

తెలంగాణ మీడియాలో టీడీపీకి ఇంపార్టెన్స్ లేదా..!

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాక‌పోయినా.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి.. గ‌త కొన్నాళ్లుగా మ‌రింత దూకుడుగా ఉన్నాడు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వాడి వేడిని మ‌రింత పెంచారు. ఇటీవ‌ల ముగిసిన మ‌హానాడు త‌ర్వాత ఈ వాడి మ‌రింత పెరిగింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌డు ప్ర‌ధాన స‌మ‌స్య‌.. టీడీపీకి మీడియా క‌వ‌రేజ్ ఘోరంగా త‌గ్గిపోయింద‌ట‌! తమ ప‌క్షానే ఉంటాయ‌ని భావించిన ఆ రెండు ప‌త్రిక‌లు […]

మీడియాకు కేసీఆర్ కూల్ వార్నింగా..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాట‌ల మాంత్రికుడ‌ని, ప్ర‌తిప‌క్షాల‌న్నా…రాజ‌కీయ చ‌తుర‌త క‌లిగిన నాయ‌కుడ‌ని, అభిమానులు అన్నా…ఈ గులాబీ బాస్ స్టైలే సెప‌రేటు. ప్ర‌తిప‌క్షాలు, మిత్ర‌ప‌క్షాలు, సొంత పార్టీ నేత‌లు…ఇలా ఎవ‌రినైనా స‌రే మాట‌ల‌తో క‌ట్టిప‌డేసే నైజం ఆయ‌న‌కే సొంతం. ఈ విష‌యంలో మీడియా కూడా మిన‌హాయింపు కాదు. ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. తాజాగా క్యాబినెట్ స‌మావేశం అనంత‌రం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్ మీడియాను హ్యాండిల్ చేసిన విధాన‌మైతే అదుర్స్ అని చెప్పొచ్చు. ఒక్క […]

హోదాను ప్ర‌జ‌ల‌కు చేర‌నివ్వ‌ని మీడియా

ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో ఉవ్వెత్తున ఎగిసిన‌ తెలంగాణ ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి గ్రామ‌గ్రామాన స్ఫూర్తి ని ర‌గిలించ‌డంలో దిన‌ప‌త్రిక‌లు ప్ర‌ధాన పాత్ర పోషించాయి. అలాగే మీడియాలోని అన్ని వర్గాలు తెలంగాణ ఉద్య‌మానికి బాస‌ట‌గా నిలిచాయి! అలాగే త‌మిళులు జ‌ల్లిక‌ట్టుపై తెలిపిన నిర‌స‌న‌ను మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తితో హోదా కావాల‌ని పోరాడుతున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు మాత్రం మీడియా స‌పోర్ట్ ఉండ‌టం లేదా? భావోద్వేగాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌కుండా అడ్డుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు కొంద‌రు […]

మీడియాలో ప‌వ‌న్‌ను తొక్కేస్తున్నారా..!

రాజ‌కీయాల‌కూ.. మీడియాకు ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంతాకాదు. ఎవ‌రినైనా ఎత్తేయాల‌న్నా.. ఎవ‌రిని తొక్కేయాల‌న్నా.. మీడియాకు సాటి మ‌రొక‌టి లేదు!! 1980ల నుంచే ఉమ్మ‌డి ఏపీలో పాలిటిక్స్‌పై మీడియా ప్ర‌భావం భారీస్థాయిలో సాగింది. అప్ప‌ట్లో పార్టీ పెట్టిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌టీఆర్‌కి మీడియానే అండ‌గా నిలిచింద‌ని చెబుతారు. తాను వెళ్ల‌లేని చోట్ల‌కి సైతం మీడియా వెళ్లిందని, ఎన్‌టీఆర్‌కి పాజిటివ్‌గా ప‌నిచేసింద‌ని తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌ట్లో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు కూడా ఏపీ పాలిటిక్స్‌లో మీడియానే […]

ప‌వ‌న్ ముందుకు మీడియా పంచాయితీ

ఇప్పుడు ఏపీలో ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. రివ్వున వెళ్లి.. జ‌న‌సేనాని గుమ్మం ముందు వాలిపోతున్నారు! మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించు మ‌హాప్ర‌భో అంటూ జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్‌కి త‌మ‌గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌ను పెడుతున్న క‌ష్టాల‌ను కూడా ఎక‌ర‌వు పెడుతున్నారు. 2014లో జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్‌కి జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ఉంది. అప్ప‌టి ఎన్న‌క‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిచ్చి గెలిపించిన ప‌వ‌న్ త‌ర్వాత దూరంగా ఉన్నారు. అయితే, ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూముల […]

ఎంపీ క‌వితకి మీడియా పిచ్చి ఎంతంటే..!

సాధార‌ణంగా పొలిటీషియ‌న్ల‌కి మీడియా గొట్టం ముందుంటేనే కానీ గొంతు పెగ‌ల‌ద‌నే విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో ఇది మ‌రింత‌గా పెరిగిపోయింది. మీడియా ఛానెళ్లు పెరిగిపోవ‌డం, క్ష‌ణాల్లోనే ఆయా నేత‌ల వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాల్లో రెస్పాన్స్ రావ‌డం, ఎక్క‌వు మంది దృష్టి వారిపై మ‌ళ్ల‌డం వంటి ప్ర‌ధాన కార‌ణాల నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌తి గ‌ల్లీ నేత సైతం మీడియా ముందు త‌ప్ప ఇంకెక్క‌డా మాట్లాడేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌న నేత‌ల‌కు మైకులుంటేనేగానీ.. మాట్లాడ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది… అందుకే […]