సెలబ్రిటీలకే కొమ్ముకాస్తున్న మీడియా..!

మీడియా అనేది ప్రజల పక్షంగా ఉండాలి.. అంతేకానీ డబ్బు ఉన్న వారికి కొమ్ముకాసే లాగా మారకూడదు.. ముఖ్యంగా ఒక మీడియా ఏదైనా చెబుతోంది అంటే ధనిక, పేద అనే తేడా లేకుండా నిజం నిర్భయంగా చెప్పగలిగినప్పుడే మీడియా ఏంటో ప్రజలకు అర్థమవుతోంది.. ఇక్కడ కొన్ని మీడియా వర్గాలు మాత్రం కేవలం డబ్బున్న ధనికుల వైపు మాత్రమే ఫోకస్ చేస్తూ.. సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదు.. ఇకపోతే నిన్నటికి మొన్న ఆరు సంవత్సరాల చైత్ర అనే చిన్నారిని ఒక […]

ఆ తేదీవ‌ర‌కూ క‌రోనా తీవ్రత.. విశాఖ శార‌దాపీఠం

కొవిడ్ సెకండ్ వేవ్ సుడిగాలిలా విజృంభిస్తున్న‌ది. మ‌హ‌మ్మారి పంజాకు వేలాది మంది ప్రాణాల‌ను కోల్పోతుండ‌గా, ల‌క్ష‌లాదిమంది గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా విశాఖ శార‌దా పీఠాధిప‌తులు శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి మ‌హాస్వామి క‌రోనా ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటుంద‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్‌ 13వ తేదీన) పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న […]

ఇలా అయితే ఎలా సాక్షి.. జ‌గ‌న్‌కు మైన‌స్సేగా

నంద్యాల తీర్పు వ‌చ్చేసింది. అధికార పార్టీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుని సైకిల్‌పై రివ్వున సాగిపోయింది. త‌మ‌దే సీట‌ని భావించి, అతికిపోయిన వైసీపీ చ‌తికిల ప‌డింది. ఇది వాస్త‌వం!! ఏ జ‌ర్న‌లిస్ట‌యినా.. ప‌త్రికైనా ముందుగా రాయాల్సింది ఇదే! ఇక‌, ఆ త‌ర్వాత వారివారి అభిమానాన్ని బ‌ట్టి.. వార్త‌ల ప్ర‌చుర‌ణ ఉండాలి. కానీ, ఈ విజ‌యాన్ని కూడా ఏక‌ప‌క్షంగా చూడ‌డం అనేదే ఇప్పుడు అసంతృప్తికీ.. జ‌ర్న‌లిజంపై రాళ్లేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ స్థాపించిన ప‌త్రిక సాక్షి… […]

డ్రగ్స్ ఉచ్చులో మీడియాధిప‌తి, 15 మంది విలేక‌ర్లు

ప్ర‌స్తుతం డ్ర‌గ్స్ ఇష్యూ టాలీవుడ్‌లో పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మంది ప్ర‌ముఖుల‌కు ఇప్ప‌టికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచార‌ణ ప్రారంభించారు. ఈ విచార‌ణ ప‌రంప‌ర‌లో బుధ‌వారం డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌ను, గురువారం సినిమాటోగ్రాఫ‌ర్ శ్యాం కె.నాయుడును విచారించిన అధికారులు శుక్ర‌వారం సుబ్బ‌రాజును విచారిస్తున్నారు. ఇక తొలి రెండు రోజులు విచార‌ణ త‌ర్వాత సిట్ అధికారుల‌కు దిమ్మ‌తిరిగిపోయే విష‌యాలు తెలిశాయ‌ట‌. పూరీ, శ్యాం కె నాయుడును సిట్ అధికారులు […]

ఈనాడు అలా… ఆంధ్ర‌జ్యోతి ఇలా

ప్ర‌ధాన తెలుగు దిన‌ప‌త్రిక‌లు అయిన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి రెండిటిపై టీడీపీకి ఫేవ‌ర్ అన్న ముద్ర ఉంది. అయితే ఈ విష‌యంలో ఆంధ్ర‌జ్యోతితో పోలిస్తే ఈనాడు కాస్త న్యూట్ర‌ల్‌గానే ఉంటుంది. ఏదైనా విష‌యాన్ని మ‌రీ ప‌చ్చిగా, అభూత‌కల్ప‌న‌లు లేకుండా ప్ర‌చురిస్తుంటుంది. అలాగే అంద‌రికి మంచి ప్ర‌యారిటీయే ఇస్తుంది. ఇక ఆంధ్ర‌జ్యోతి అలా కాదు.. జ‌గ‌న్ అన్నా, వైసీపీ అన్నా రెచ్చిపోయి మ‌రీ రంకెలేస్తోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు తెలంగాణ‌లోను అధికార టీఆర్ఎస్‌కు యాంటీగా దూకుడుగా వెళ్లిన జ్యోతి […]

ఆంధ్ర‌జ్యోతితో క్లోజ్‌గా ఉండే వైసీపీ నాయ‌కుల ప‌ని అంతే..!

ప్ర‌స్తుతం తెలుగు మీడియాలో చాలా ప‌త్రిక‌లు పార్టీల‌కు క‌ర‌ప‌త్రిక‌లుగా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. పార్టీలు – ప‌త్రిక‌లు క‌ర‌ప‌త్రిక‌లు అన్న అంశంపై తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా చ‌ర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీకి అనుకూలంగా మీడియా చీలిపోయింద‌న్న‌ది నిజం. ఈ క్ర‌మంలోనే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టీడీపీ వాళ్లు త‌మ స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తించ‌డం లేదు. ఇక టీడీపీకి అనుకూలంగా కొమ్ముకాస్తోన్న మీడియా సంస్థ‌ల‌ను వైసీపీ వాళ్లు అలాగే చేస్తున్నారు. గతంలో […]

ఆ మంత్రుల‌కు చంద్ర‌బాబు వార్నింగ్ వెన‌క‌..!

టీడీపీ అంటే ఒక‌ప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు. టీడీపీ వాళ్లంతా ఒకే కుటుంబంలోని అన్న‌ద‌మ్ముళ్లా క‌లిసి మెలిసి ఉండేవారు. అయితే అదంతా గ‌తం ఇప్పుడు సీన్ మారిపోయింది. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక పార్టీలో ఎవ‌రికి వారే ఇష్ట‌మొచ్చిన‌ట్టు స్వ‌రం పెంచేస్తున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు వార్నింగ్‌లు కూడా ప‌ని చేయ‌డం లేదు. చాలా మంది అయితే చంద్ర‌బాబునే లైట్ తీస్కొంటున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఎవ‌రో ఒక నాయ‌కుడు నోరు జార‌డం, అది మీడియాలో హైలెట్ […]

రామోజీకి – చంద్ర‌బాబుకు దూరం ఎందుకు

తెలుగుదేశం-ఈనాడు బంధం బీట‌లు వారుతోందా? టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీరావుకు మ‌ధ్య దూరం పెరుగుతోందా? అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈనాడు, టీడీపీది ద‌శాబ్దాల అనుబంధం! ప్ర‌స్తుతం ఇది క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఈనాడు త‌ర్వాత టీడీపీని ఎక్కువ మోస్తున్న సంస్థ ఆంధ్ర‌జ్యోతికి సీఎం చంద్ర‌బాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌టం కూడా ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. త‌న రాజ‌కీయ గురువు రామోజీరావును చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్ట‌డం వెనుక కార‌ణాలేంట‌నే […]

మీడియాకి కేటీఆర్ పాఠాలు.. నిజాలు చెప్పినందుకే!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నిమీడియా సంస్థ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. పెయిడ్ ఆర్టిక‌ల్స్ రాస్తున్నాయ‌ని తెగ ఫీలైపోతున్నారు. అంతేకాదు, ప‌త్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ పీకుతున్నారు. గ‌తంలో టీఆర్ ఎస్‌కు అనుకూలంగా రాయ‌ని ప‌త్రిక‌లు ప‌త్రిక‌లే కావ‌ని, ప్ర‌సారం చేయ‌ని మీడియా మీడియానే కాద‌ని గులాబీ ద‌ళం తీర్మానించేసింది. అప్ప‌ట్లో టీఆర్ ఎస్‌ని, కేసీఆర్‌ని పొడుగుతూ ప‌త్రిక‌లు రాసిన క‌థ‌నాలు, వెలువ‌రించిన వార్త‌లు పెయిడ్ న్యూస్‌గా క‌నిపించ‌ని కేటీఆర్‌కి.. ఇప్పుడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా […]