సెలబ్రిటీలకే కొమ్ముకాస్తున్న మీడియా..!

September 15, 2021 at 11:47 am

మీడియా అనేది ప్రజల పక్షంగా ఉండాలి.. అంతేకానీ డబ్బు ఉన్న వారికి కొమ్ముకాసే లాగా మారకూడదు.. ముఖ్యంగా ఒక మీడియా ఏదైనా చెబుతోంది అంటే ధనిక, పేద అనే తేడా లేకుండా నిజం నిర్భయంగా చెప్పగలిగినప్పుడే మీడియా ఏంటో ప్రజలకు అర్థమవుతోంది.. ఇక్కడ కొన్ని మీడియా వర్గాలు మాత్రం కేవలం డబ్బున్న ధనికుల వైపు మాత్రమే ఫోకస్ చేస్తూ.. సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదు..

ఇకపోతే నిన్నటికి మొన్న ఆరు సంవత్సరాల చైత్ర అనే చిన్నారిని ఒక దుర్మార్గుడు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసి, రోడ్డుపైన కాలర్ ఎగరేసుకుని తిరుగుతుంటే, అప్పుడు మీడియా ఏం చేస్తోంది.. నిన్న సాయి ధరంతేజ్ కు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందని, ఏ మీడియా ఛానల్ లో చూసిన అతని గురించి వార్త లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాయి.. మీడియాకు కేవలం సెలబ్రిటీలు మాత్రమే అవసరమా. సామాన్య ప్రజలు అవసరం లేదా.. సామాన్య ప్రజల కోసమే మీడియా వర్గాలు ఉన్నాయి అనే విషయాన్ని వారు మర్చిపోతున్నారా..? ఇక ఎక్కడుంది న్యాయం..

ఇక రోజురోజుకు బాధను భరిస్తూ, దినదినగండంగా నరకయాతన అనుభవిస్తున్న చైత్ర తల్లిదండ్రులకు సపోర్ట్ గా నిలిచే దెవరు.. బాధ తట్టుకోలేక సాయిధరంతేజ చికిత్స పొందుతున్న హాస్పిటల్ ముందు చైత్ర బంధు వర్గాలు మీడియా వర్గాల పై ధర్నా కూడా చేశారు.. ఇక ఈ పాప మృతదేహానికి మీడియా ఎలాంటి సమాధానం చెబుతుందో మనం వేచి చూడాలి

సెలబ్రిటీలకే కొమ్ముకాస్తున్న మీడియా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts