త్రివిక్ర‌మ్ నెత్తిపై మ‌రో పెద్ద బాధ్య‌త‌ను పెట్టేసిన ప‌వ‌న్‌..?!

September 15, 2021 at 11:44 am

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్నేహ‌బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వీరిద్ద‌రూ మంచి ఆప్తులు. పవన్ సినిమాల సెలక్షన్ విషయంలోనూ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్‌తో చేయాల్సిన సినిమాను ప‌క్క‌న పెట్టి మ‌రీ ప‌వ‌న్ న‌టిస్తున్న `భీమ్లా నాయ‌క్‌`కు మాటుల‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు త్రివిక్ర‌మ్‌.

Pawan Kalyan and Trivikram to team up for their fourth film? | Telugu Movie News - Times of India

అయితే ఇప్పుడు ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ నెత్త‌పై మ‌రో పెద్ద బాధ‌త్య‌ను పెట్టేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపింస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా భారీగా పెరిగి పోయింది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ ని మ‌ళ్లీ ట్రాక్‌లోకి తెచ్చి ఓటీటీల కోసం చిన్న చిన్న సినిమాల‌ను నిర్మించాల‌ని ప‌వ‌న్ ఎప్ప‌టి నుంచో భావిస్తున్నార‌ట‌.

After the flop of Katamarayudu, Powerstar Pawan Kalyan hasnt took much break and joined the sets of Trivikram Srinivas film.… | Kristen stewart movies, Kalyan, Film

ఇప్పుడు ఈ బాధ్య‌తను మొత్తం త్రివిక్ర‌మ్ పైనే పెట్టార‌ట ప‌వ‌న్‌. క‌థ‌లు విన‌డం, ద‌ర్శ‌కుల్ని ఎంచుకోవ‌డం, ప్రాజెక్టు ప‌ట్టాలెక్కించ‌డం..ఇవ‌న్నీ త్రివిక్ర‌మ్‌ను చూసుకోవాల్సిందిగా ప‌వ‌న్ కోర‌గా.. అందుకు ఆయ‌న ఓకే చెప్పిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, అతి త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై ఓ మూవీని రూపొందించాల‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

త్రివిక్ర‌మ్ నెత్తిపై మ‌రో పెద్ద బాధ్య‌త‌ను పెట్టేసిన ప‌వ‌న్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts