ఆ ఏపీ మంత్రికి నాలుగు డీ గ్రేడ్లు

చంద్ర‌బాబు కేబినెట్‌లో కీల‌క శాఖ‌లు చూస్తున్న ఓ మ‌హిళా మంత్రి ఫ్యూచ‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా? ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన ఫ‌లితంగా స‌ద‌రు నేత ఇక‌ ఇంటి ముఖం ప‌ట్టాల్సిందేనా?  మ‌రికొద్ది రోజుల్లో జ‌రుగుతుంద‌ని భావిస్తున్న ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఆ మ‌హిళా మంత్రిగారు త‌న సీటును ఖాళీ చేయాల్సిందేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు విజ‌య‌వాడ‌లోని కేఎల్ యూనివ‌ర్సిటీలో మూడు రోజుల‌పాటు శిక్ష‌ణ […]

ఏపీ టీడీపీ నేత‌ల పూజ‌లు ఎందుకో..!

ఇప్పుడు ఏపీలో ఏ ప్ర‌ముఖ దేవాల‌యంలో చూసినా.. చంద్ర‌బాబు కేబినెట్‌లోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే క‌నిపిస్తున్నారు! ఇది జోక్ కాదు నిజ‌మే! అయితే, వారు దేవుడి మీద భ‌క్తి ఉండి వెళ్తున్నారా?  లేక వాళ్ల మ‌న‌సులో ఉన్న కోరిక తీర్చ‌మ‌ని అడిగేందుకు వెళ్తున్నారా?  లేక త‌మకున్న ప‌ద‌వీ గండం త‌ప్పించ‌మ‌ని కోరేందుకు వెళ్తున్నారా? అంటే మాత్రం ఒక్కొక్క‌ళ్ల‌ది ఒక్కో కోరిక అని చెప్ప‌క త‌ప్ప‌దు. సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే, […]

మంత్రి వర్గ విస్తరణ – చినబాబు ఒక్కడేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనల్లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకనే విస్తరణ కాకుండా ఒక్కర్ని ప్రస్తుతానికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుని, విస్తరణను వాయిదా వేయాలని చూస్తున్నారట. ఆ ఒక్కరూ ఎవరో కాదట, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ అట. చినబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినవస్తున్న వేళ, తన కుమారుడ్ని […]

మోసం, పచ్చి దగా! చేస్తున్నదెవరు?

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోంది. మోసం, కుట్ర, దగా ఇంకా ఇంకా పెద్ద పదాలు ఉపయోగించాలి. ఎక్కడన్నా కోరుకుంటే రాష్ట్రాల విభజన జరుగుతుంది. కానీ 13 జిల్లాల సీమాంధ్ర కోరుకోని విభజన జరిగింది. అక్కడే, దేశం నుంచి ఆ 13 జిల్లాల్ని కేంద్రం వెలివేసిందా? అన్న భావన కలిగింది అక్కడి ప్రజల్లో. పోనీ, ఆ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందా? అంటే అది కూడా లేదు. హోదా ఇవ్వలేంగానీ […]

టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు తెలుగు దేశం పార్టీ రంగంలోకి దిగింది.పబ్లిక్ ఒపినీయన్ లో 25-30 మంది ఎమ్మెల్యేలపై మాత్రం సదభిప్రాయం వ్యక్తమయినట్లు సమాచారం. సగానికిపైగా ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని పరిసర జిల్లాల్లోని ఇద్దరు మంత్రుల భార్యలు కౌంటర్లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక శాఖ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించి ఏమైనా పనులు కావాలంటే సదరు మంత్రి సతీమణిని సంప్రదించాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. అందులో దాదాపు 200 […]

సింగపూర్ సంస్థకు అమరావతి ఛాన్స్

కొత్త రాజధాని అమరావతి అభివృద్ధి అవకాశాన్ని సింగపూర్‌ కన్సార్టియంకు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే సింగపూర్‌ సంస్థకు 58 శాతం ఈక్విటీని ఖరారు చేశారు. ఈ పెట్టుబడికి అదే స్థాయిలో ఆదాయాన్ని కూడా సమకోర్చాలని నిర్ణయిరచారు. సింగపూర్‌ సంస్థకే స్విస్‌ ఛాలెంజ్‌ ద్వారా రాజధాని నిర్మాణ బాధ్యత అప్పగించేందుకు దాదాపు నిర్ణయించిన నేపథ్యంలో ఆ సంస్థకు కల్పించాల్సిన ప్రయోజనాలపైనా అధికారులు విస్తృతంగా కసరత్తు చేశారు. గత నాలుగు రోజులుగా ఇదే అంశాలపై ఉన్నతాధికారులు […]

తడిచి మోపెడు అవుతున్న ఉద్యోగుల తరలింపుఖర్చు

ఉద్యోగుల తరలింపుఖర్చు ప్రభుత్వానికి తడిసి మోపెడు కానుంది. సచివాలయంలో మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల కార్యాలయాలకు మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారు. అదీ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సాధ్యపడేలాలేదు. కాగా హెచ్‌ఓడిలకు సంబంధించి మీ కార్యాలయాలను మీరే వెతుక్కోండని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో రెట్టింపు అద్దెలతో లీజుల పందేరానికి తెరలేచినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు దళారులు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. తరలింపు ప్రక్రియ ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉంటే మూడేళ్లపాటు ప్రైవేటు భవనాలకు లీజులు […]

బడ్జెట్ లో లోటు దుబార లో గ్రేటు….

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ […]