ట్రబుల్ లో కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్…

తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. శాంపుల్‌గా హైదరాబాద్‌లో కొన్ని ఇళ్లను చూపించింది.. వాటిని చూసిన ప్రజలు సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే విహరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉంది.. ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రి సొంత జిల్లా ఆదిలాబాద్‌లో అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా […]

ఈ సారైనా స్మార్ట్ సిటీ దక్కేనా…

రెండో దఫా స్మార్ట్‌ సిటీలో తిరుపతికి చోటుదక్కుతుందోలేదోనన్న ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో కొలువుదీరిన వెంకయ్యనాయుడు ఈ సారైనా కరుణిస్తారోలేదోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.వంద నగరాల్లో మొదటి దఫా 20 నగరాలను ఎంపికచేసినా.. అందులో తిరుపతికి చోటుదక్కని సంగతి తెలిసిందే. 40 నగరాలతో రెండో జాబితాను ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత 13 నగరాలను ఎలాంటి ఎంపిక ప్రతిపాదనలు లేకుండానే ఈ ఏడాది మేలో ప్రకటించారు. మిగిలిన 27 నగరాలను ఆగస్టు 15లోపు ప్రకటించాల్సి ఉంది. […]

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు తేలాయి….

విభజన జరిగిన రెండేళ్ల తర్వాత… రెండు రాష్ట్రాల పంచుకోవలసిన ఆస్తుల లెక్కలు తేలుతున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న సంస్థల ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 142 సంస్థల్లో 132 సంస్థల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. మరో 10 సంస్థల నుంచి వివరాలు అందలేదు. భూములు, భవనాలతో కూడిన భూములు, కార్యాలయాల సామగ్రి, వివిధ సంస్థల మెషినరీ సంబంధిత సామగ్రి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్లు… […]

నెహ్రు ఎంట్రీ తో టీడీపీ లో ఆ ముగ్గురికి తలనొప్పి

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలో చేర‌తార‌న్న ప్రచారం ఊపందుకుంది. పుష్క‌రాల త‌ర్వాత నెహ్రూ ఆయ‌న త‌న‌యుడు దేవినేని అవినాష్ టీడీపీలో చేర‌తార‌ని కూడా విజ‌య‌వాడ పాలిటిక్స్‌లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నెహ్రూ రెండు రోజుల క్రితం ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట్రావును ఆయ‌న నివాసంలో క‌లిశారు. నెహ్రూతో పాటు మాజీ ఎమ్మెల్యే గ‌ద్దే బాబూరావు కూడా ఈ భేటీలో ఉన్నారు. నెహ్రూ టీడీపీ ఎంట్రీ విష‌యాన్ని గ‌తంలోనే గ‌ద్దే […]

చంద్రబాబు పై అసంతృప్తితో పయ్యావుల

టీడీపీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశవ్‌.. పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై ప‌రోక్షంగా ఫైర‌య్యారా? చ‌ంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ద‌శాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తున్నా, ప‌దేళ్లపాటు ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు నానా తిప్పలు ప‌డి అధికారంలోకి తీసుకువ‌చ్చినా త‌మ‌కు ఎలాంటి గుర్తింపూ లేద‌ని ఆయ‌న వాపోతున్నట్టు తెలిసింది. అంతేకాదు, ముందొచ్చిన చెవుల క‌న్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా పార్టీ అధినేత త‌మ‌ను కాద‌ని, ఇప్పుడిప్పుడే సైకిలెక్కుతున్న వారిని […]

పెళ్లిచూపుల‌కు కోసం సల్మాన్ ఖాన్ రెడీ !

తెలుగు సినిమాల‌పై బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ మ‌న‌సు పారేసుకున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఇదివ‌రకే పోకిరి, రెడీ,కిక్ లాంటి హిట్ చిత్రాల‌ను హిందీలో రీమేక్ చేసి స‌క్సెస్ సాధించిన ఈ భ‌జ‌రంగీ భాయిజాన్ క‌ళ్లు తాజాగా పెళ్లిచూపులు చిత్రంపై ప‌డ్డాయి. పెళ్లి చూపులు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఈ సిన్మాపై స‌ల్మాన్‌ఖాన్ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే సీనియ‌ర్ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు స‌ల్మాన్ కోసం ఓ స్పెష‌ల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు […]

‘మనమంతా’ అద్భుతహ

కమర్షియల్‌ హంగుల గురించి ఆలోచించకుండా తనకు నచ్చిన దారిలో విలక్షణ చిత్రాలు చేయడంలోనే సంతృప్తి చెందుతున్న దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి. చేసే ప్రతి చిత్రమూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఈ ప్రయత్నంలో అక్కడక్కడా నిరాశ ఎదురయినా, తన పంధాను వీడలేదాయన. ఆయన్నుంచి వచ్చిన తాజా చిత్రం ‘మనమంతా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మలయాళ్‌ సూపర్‌ స్టార్‌ అయిన మోహన్‌లాల్‌ను చాలాకాలం తర్వాత తెలుగు తెరపైకి తీసుకొచ్చిన ఘనత చంద్రశేఖర్‌ ఏలేటికే దక్కింది. మోహన్‌లాల్‌ని ఈ సినిమా […]

‘త్వరలో’ అంటే పదేళ్ళు సరిపోద్దా!

త్వరలో ప్రత్యేక హోదాపై స్పష్టత రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి. ఈలోగా తొందరపాటు నిర్ణయాలు తగవనీ, ఆందోళనల వల్ల ఉపయోగం లేదని, నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా చూస్తోందని ఈ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కానీ ప్రత్యేక హోదా వస్తుందని నమ్మి భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు హోదా రాక తీవ్ర నిరాశ చెందుతున్నమాట వాస్తవం. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా […]

చంద్రబాబు తలంటు పోసేశారు నిజమే!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా బిజెపి వ్యూహాల్ని అమలు చేస్తే, ఆ వ్యూహాలు విజయవంతమైనప్పుడు సుజనా చౌదరి బల్లలు చరుస్తూ ఆమోదం తెలపడం వివాదాస్పదమయ్యింది. మిగతా అంశాల్లో అయితే సుజనా చౌదరి తీరుని చంద్రబాబు సమర్థించేవారే. కానీ అక్కడ ప్రత్యేక హోదా అంశంపై ప్రవేశపెట్టిన బిల్లు కావడంతో వివాదం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. దాంతో చంద్రబాబు, […]