ఇద్దరూ కావాలంటున్న చైతూ

నాగ చైతన్య సినిమాలు వరుసగా రిలీజ్‌కి రెఢీగా ఉన్నాయి. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వెంటనే ఒక నెల గ్యాప్‌లో రెండో సినిమా ‘ప్రేమమ్‌’ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ లోపల చైతూ మరో కొత్త సినిమాకి సైన్‌ చేశాడన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో నాగార్జునకి రొమాంటిక్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో చైతూ […]

పుష్కరం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకం

పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాలు ఎంతో ప్రత్యేకమైనవి. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏడాది తిరిగింది, ఈసారి కృష్ణా పుష్కరాలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేశాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు జరగనుండగా, ముందే పుష్కర వైభవం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రత్యేకం ఈ కృష్ణా పుష్కరాలు. ఎందుకంటే, పుష్కరాలు జరిగే ప్రధానమైన రెండు జిల్లాల […]

సివిల్స్ టెస్ట్ లో మోడీ జపం

సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్ ప‌రీక్షలో మోదీ ప్రభుత్వంపై అడిగిన ప్రశ్నలు అభ్యర్థుల‌కు నిజ‌మైన ప‌రీక్ష పెట్టాయి. మొత్తం వంద ప్రశ్నల్లో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల గురించే 13 కావ‌డం గ‌మ‌నార్హం. ప్రధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, స్టాండ‌ప్ ఇండియా, ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజ‌న‌, స్ట‌డీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫ‌ర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్‌, ప్రధాన‌మంత్రి ముద్రా యోజ‌న‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ల‌పై ప్రశ్నలు అడిగారు. వీటిపై చాలామంది అభ్యర్థులు మండిప‌డుతున్నారు. ఆధునిక చ‌రిత్ర‌, […]

అభిమానులకు టెన్షన్ పుట్టిస్తున్న పవన్

తన లేటెస్ట్ సినిమా మ్యాటర్లో పవర్ స్టార్ అనుసరిస్తున్న వ్యూహాలు… అతని ఫ్యాన్స్ కు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెంటిమెంట్స్ ను గుర్తుకు తెస్తున్నాయి.దీంతో పవన్ అభిమానులకు లేనిపోని టెన్షన్ పట్టుకుంది. ఇదే విషయం అటు పరిశ్రమలోను టాక్ అయిపోయింది.ఇంతకీ పవన్ అనుసరిస్తోన్న వ్యూహమేంటి..? ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాణం జరిగినప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి.‘సర్దార్’ సినిమా మొదలు అయ్యాక ఆ సినిమా దర్శకుడు సంపత్ నందిని తప్పించి పవన్ ఆ బాధ్యతను […]

మెగా, నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలకు గిరాకి భలే ఉంది.వన్సపాన్ ఎ టైమ్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చున్న తర్వాత మల్టీ స్టారర్ చిత్రాల్లో చేయలంటే ఇబ్బంది పడేవారు. మరి ఆ రోజుల్లో అగ్రనటులంతా మల్టిస్టారర్ చిత్రాలు చేసినవారే.ఆ ట్రెండ్ ఇపుడు తెలుగులోను ఎక్కువువుతుంది.తాజా పరిస్థితి చూస్తే ఈవిషయం మనకు భాగా అర్ధమవుతుంది. టాలీవుడ్లో మల్టీస్టారర్ ఫీవర్ మళ్లీ మొదలైందా అనిపిస్తుంది. గత కొంతకాలంగా వస్తోన్న సినిమాలను చూస్తుంటే ఇది మనకు భాగా తెలుస్తోంది.మరి […]

విశాఖకు దూరమవుతున్న విద్యాసంస్థలు

ప్రతిష్ఠాత్మకమైన వివిధ విద్యా సంస్థలను విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ అవి ఇతర జిల్లాలకు తరలిపోతున్నాయి. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం) కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించాలని నిర్ణయించారు. విభజన నేపథ్యంలో పలు విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందు కు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని విశాఖలో ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఏర్పడిన విషయం తెలిసిందే. అందులో కొన్ని […]

ట్రబుల్ లో కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్…

తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. శాంపుల్‌గా హైదరాబాద్‌లో కొన్ని ఇళ్లను చూపించింది.. వాటిని చూసిన ప్రజలు సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే విహరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉంది.. ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రి సొంత జిల్లా ఆదిలాబాద్‌లో అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా […]

ఈ సారైనా స్మార్ట్ సిటీ దక్కేనా…

రెండో దఫా స్మార్ట్‌ సిటీలో తిరుపతికి చోటుదక్కుతుందోలేదోనన్న ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో కొలువుదీరిన వెంకయ్యనాయుడు ఈ సారైనా కరుణిస్తారోలేదోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.వంద నగరాల్లో మొదటి దఫా 20 నగరాలను ఎంపికచేసినా.. అందులో తిరుపతికి చోటుదక్కని సంగతి తెలిసిందే. 40 నగరాలతో రెండో జాబితాను ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత 13 నగరాలను ఎలాంటి ఎంపిక ప్రతిపాదనలు లేకుండానే ఈ ఏడాది మేలో ప్రకటించారు. మిగిలిన 27 నగరాలను ఆగస్టు 15లోపు ప్రకటించాల్సి ఉంది. […]

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు తేలాయి….

విభజన జరిగిన రెండేళ్ల తర్వాత… రెండు రాష్ట్రాల పంచుకోవలసిన ఆస్తుల లెక్కలు తేలుతున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న సంస్థల ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 142 సంస్థల్లో 132 సంస్థల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. మరో 10 సంస్థల నుంచి వివరాలు అందలేదు. భూములు, భవనాలతో కూడిన భూములు, కార్యాలయాల సామగ్రి, వివిధ సంస్థల మెషినరీ సంబంధిత సామగ్రి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్లు… […]