‘ రజాకర్ ‘ సినిమాను ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్.. కారణం ఏంటంటే..?!

తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో సరికొత్త స్టోరీతో రజాకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గడ్డపై పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రజాకర్.. ది సైలెంట్ జోన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆట సత్యనారాయణ దర్శకత్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక ప్రేమ, అనుష త్రిపాఠి, ఇంద్రజ అనసూయ, మకరం దేశ్ పాండే లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా పోస్టర్ తాజాగా రిలీజై నెటింట‌ తెగ వైరల్‌గా మారింది.

అలాగే తెలంగాణ నేపథ్యంలో తెర‌కెక్కిస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి ఆశ‌క్తి నెలకొంది. కాగా ఇటీవల ఈ సినిమాను ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలా చేశారు. సినిమా ప్రదర్శనను సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ చేసిందని.. ప్రొడ్యూసర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు రజాకర్ సినిమాపై అభ్యంతరం ఉంటే.. నిపుణులు కమిటీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని పిటీషనర్‌కు వెల్లడించారు.

సెన్సార్ బోర్డ్‌ సర్టిఫికెట్‌ను సవాలు చేసినందుకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని.. ధర్మశాస్త్రం వివరించింది. ఇక దీంతో ఈ పిటిషన్‌ను కొట్టి వేసింది హై కోర్ట్‌. ఈ సినిమాకి గూడూరు నారాయణరెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈనెల 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రజాకర్ మూవీ రిలీజ్‌ని నిలిపేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలా చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కమిటీ.. ఆ పిటిషన్ చెల్లదంటూ కొట్టి వేసింది. సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.